E-Paper
Advertisement

Horror thriller OTT: ఓటీటీలోకి టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?

Horror thriller OTT:  ఓటీటీలోకి టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్… ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

Horror thriller OTT : ఓటీటీలోకి టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆరుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ మూవీ, ఊపిరి సలపని యాక్షన్, ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో కుర్చీలకు కట్టిపడేస్తుంది. ఈ సినిమా పార్ట్ 1 సూపర్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 తీయడం జరిగింది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ వీకెండ్ సినిమా చూసి ఫుల్ గా చిల్ అవ్వండి. ఈ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్

ఈ జపనీస్ హారర్ మూవీ పేరు రీ/మెంబర్: ది లాస్ట్ నైట్ (Re/Member: The Last Night). ఇందులో కన్నా హషిమోటో, గోర్డాన్ మేడా, మారిన్ హోండా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 మార్చి 5 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. భాష: ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జపనీస్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే దీనికి ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 2022లో వచ్చిన ‘రీ/మెంబర్’ చిత్రానికి సీక్వెల్. ఇక మరో విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రసిద్ధ కె-పాప్ గ్రూప్ స్ట్రే కిడ్స్ పాడిన “పరేడ్” అనే పాట చాలా ఫేమస్ అయింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మొదటి భాగంలో ‘రెడ్ పర్సన్’ శాపం నుండి తప్పించుకున్న అసుక (కన్నా హషిమోటో) ఆమె స్నేహితులు, మూడేళ్ల తర్వాత మళ్ళీ ఊహించని ప్రమాదంలో పడతారు. అసుక అకస్మాత్తుగా మాయమవడంతో, ఆమెను వెతుకుతూ వెళ్ళిన స్నేహితులకు మళ్ళీ ఆ భయంకరమైన టైమ్ లూప్ (ఒకే రోజు మళ్ళీ మళ్ళీ రావడం) ఎదురవుతుంది. ఈసారి ఆ శాపం మరింత శక్తివంతంగా మారుతుంది. అసుక ఎక్కడుందో కనిపెట్టి, ఆమె శరీరాన్ని తిరిగి చేర్చకపోతే వారందరూ ఆ రాత్రిలోనే చిక్కుకుపోవడమే కాకుండా, తమ ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. స్కూల్ ఆవరణలో జరిగే ఈ భయంకరమైన వీళ్ళంతా కలిసి ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. చివరికి ఆ భయంకరమైన శాపం నుంచి వీళ్ళంతా ఎలా బయటపడ్డారు ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also :  ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×