E-Paper
Advertisement

తోడేలుగా మారిన అక్కను కాపాడుకునేందుకు పోరాడే చెల్లి… ఓటీటీలో వణికిస్తున్న మూవీ

తోడేలుగా మారిన అక్కను  కాపాడుకునేందుకు పోరాడే చెల్లి… ఓటీటీలో వణికిస్తున్న మూవీ
Advertisement

Horror Thriller Movie on OTT : హారర్ సినిమాలు ఎక్కువగా దయ్యాలు, ఆత్మలతో భయపెడుతుంటాయి. అయితే తోడేలు పురాణాన్ని బేస్ చేసుకుని వచ్చిన ఒక మూవీ ఆడియన్స్ ను వణికించేసింది. పాతికేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొత్తలో ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. ఆ తర్వాత డీవీడీ రూపంలో వచ్చి ఒక పెద్ద కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే సెంటిమెంట్, హైస్కూల్ లైఫ్, డార్క్ హ్యూమర్ ఈ సినిమాలో ప్రధానంగా కనిపిస్తాయి. హింసాత్మక బాడీ హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన హారర్ సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ కెనడియన్ హారర్ మూవీ పేరు ‘జింజర్ స్నాప్స్’ (Ginger Snaps). జాన్ ఫాసెట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హారర్ జానర్‌లో ఒక క్లాసిక్‌గా నిలిచింది. 2000వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమాలో జింజర్‌గా కేథరిన్ ఇసాబెల్లె, బ్రిజిట్‌గా ఎమిలీ పెర్కిన్స్ నటించారు. ఈ సినిమాకు లభించిన ప్రజాదరణ కారణంగా దీనికి సీక్వెల్ (Ginger Snaps 2: Unleashed) ప్రీక్వెల్ (Ginger Snaps Back: The Beginning) కూడా విడుదలయ్యాయి. ఈ చిత్రాన్ని సుమారు $4.5 మిలియన్ల లో బడ్జెట్‌తోనే నిర్మించారు. ఇక టెక్నికల్ గా ఈ సినిమాకు గ్రాఫిక్స్ వాడకపోవడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. దర్శకుడు గ్రాఫిక్స్ కి బదులుగా పూర్తిగా ప్రోస్తెటిక్స్, మేకప్ యానిమేట్రానిక్స్ ఉపయోగించి తోడేలు రూపాలను సృష్టించారు. దీనివల్ల హారర్ సీన్స్ అన్నీ ప్రేక్షకులకు చాలా రియలిస్టిక్‌గా అనిపిస్తాయి. అలాగే ఇందులో కొన్ని పగటి సీన్లను రాత్రి పూట షూట్ చేయాల్సి రావడంతో భారీ ఫ్లడ్‌లైట్లను వాడారు. ఆ వెలుతురు ఎంత తీవ్రంగా ఉండేదంటే, ఆకాశంలో వెళ్లే విమానాలకు కూడా ఆ సెట్ లైటింగ్ కి స్పష్టంగా కనిపించేదట. ఇలాంటి వినూత్న ప్రయోగాల వల్లే ఈ సినిమా హారర్ జానర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇది అందుబాటులోఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బెయిలీ డౌన్స్ అనే ఒక చిన్న ఊరిలో బ్రిజిట్, జింజర్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. వీరికి లోకంతో పెద్దగా సంబంధం ఉండదు, ఎప్పుడూ చావు, హారర్ విషయాలపై ఆసక్తితో ఉంటారు. వాటి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు రాత్రి వీళ్ళ బయట తిరుగుతుండగా, ఒక వింత తోడేలు జింజర్‌పై దాడి చేసి కరుస్తుంది. ఆ గాయం నుండి జింజర్ త్వరగానే కోలుకుంటుంది. అయితే ఆ తర్వాతే ఆమెలో వింత మార్పులు మొదలవుతాయి. సాధారణంగా ఉండే అమ్మాయి కాస్త కోపంగా, మొరటుగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తుంది. ఆమె శరీరంపై తోడేలు లాంటి జుట్టు రావడం, పళ్లు పదునుగా మారడం గమనించిన బ్రిజిట్, తన అక్క ప్రమాదంలో ఉందని గ్రహిస్తుంది.

ఇక జింజర్ క్రమంగా మనిషి రూపాన్ని కోల్పోతూ, ఊరిలో ఉన్న జంతువులను, మనుషులను చంపడం మొదలుపెడుతుంది. తన అక్కను ఎలాగైనా కాపాడుకోవాలని బ్రిజిట్ ఒక అబ్బాయి సహాయంతో తోడేలు కాటుకు మందు కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే జింజర్ పూర్తిగా తోడేలుగా మారిపోయి, కంట్రోల్ తప్పిపోతుంది. చివరకు ప్రాణాలకు తెగించి జింజర్‌ను ఆపడానికి బ్రిజిట్ చేసే పోరాటం, ఆ అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే బంధం చుట్టూనే మిగతా కథంతా నడుస్తుంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు సెంటిమెంట్‌తో ఈ సినిమా ముగుస్తుంది.

Advertisement

Read Also : ఎన్నేళ్ళు గడిచినా ఇలాంటి వార్ మూవీస్ ఎప్పటికీ మర్చిపోలేం… ప్రతీ సినిమా ఒక అద్భుతమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×