E-Paper
Advertisement

Horror Thriller OTT : అర్దరాత్రి గజ్జెల సప్పుడు… వ్యామోహంలో ముంచి చంపే పిశాచి… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ

Horror Thriller OTT : అర్దరాత్రి గజ్జెల సప్పుడు… వ్యామోహంలో ముంచి చంపే పిశాచి… గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడాల్సిన మూవీ
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలలో ప్రస్తుతం సస్పెన్స్, హారర్ సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారత సినిమాలు ఈ జోనర్‌లో రాణిస్తున్నాయి. కాంతారా, తుంబాడ్ లాంటి హారర్‌ సినిమాలకు పోటీ ఇచ్చే ఓ అద్భుతమైన మలయాళ సినిమా గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. సుమారు 27 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో 85 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ అయింది. తరువాత ఓటీటీలోనూ సంచలనం సృష్టించింది ఈ మూవీ.

సోనీ లివ్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హర్రర్ మూవీ ‘భ్రమయుగం’ (Bramayugam). 2024 ఫిబ్రవరి 15న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కింది. ఇదే దాని స్పెషాలిటీ. రాహుల్ సదాశివన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో మమ్ముట్టి గారు మెయిన్ లీడ్‌లో నటించారు. 72 ఏళ్ల వయసులో కూడా ఆయన చేసిన పాత్ర చూస్తే షాక్ అవుతారు. IMDbలో 7.7 రేటింగ్ ఉన్న ఈ సినిమాకు క్రిటిక్స్ నుండి సూపర్ రివ్యూస్ వచ్చాయి. మమ్ముట్టికి ఈ పాత్రకు గాను కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. సాధారణంగా సూపర్ స్టార్ అయిన మమ్ముట్టి, ఇందులో మాత్రం డేంజరస్ విలన్‌గా కనిపిస్తారు. ఆయన వేషధారణ, ఎక్స్‌ప్రెషన్స్, వాయిస్ అన్నీ భయపెట్టేలా ఉంటాయి. మాంత్రికుడి లాంటి లుక్‌తో ఆయన స్క్రీన్ మీద డామినేట్ చేస్తారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్ లాంటి నటులు కూడా తమ పాత్రల్లో బాగా నటించారు. మమ్ముట్టి పాత్ర పేరు మొదట కుంజమోన్ పొట్టి అని పెట్టారు. కానీ కోర్టు కేసు వల్ల కొడుమోన్ పొట్టిగా మార్చారు. ‘భ్రమయుగం’ ఇప్పుడు సోనీ లివ్లో (Sony Liv) స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Read Also :  హాంటెడ్ హౌస్ లో కాపురం… కొత్త పెళ్లి కూతురిపై దిక్కుమాలిన దెయ్యం కన్ను… ఒంటరిగా చూడకూడని మూవీ

స్టోరీలోకి వెళ్తే…

17వ శతాబ్దం కేరళ నేపథ్యంలో సెట్ చేసిన మూవీ ఇది. పన్నన్ కులానికి చెందిన యువ ఫోక్ సింగర్ తేవన్ చుట్టూ తిరుగుతుంది. బానిసత్వం నుండి తప్పించుకుని అడవుల్లో తిరుగుతూ, ఒక పాత మానా (పెద్ద ఇల్లు)లో చిక్కుకుంటాడు. అక్కడ కొడుమోన్ పొట్టి అనే మిస్టీరియస్ వ్యక్తి (మమ్ముట్టి) ఉంటాడు. మొదట సహాయం చేసినట్టు కనిపించినా, క్రమంగా షాకింగ్ సీక్రెట్స్ బయట పడతాయి. దట్టమైన అడవులు, ఒంటరితనం, భయంకరమైన వాతావరణం, మధ్యలో తెల్ల చీరలో వచ్చిపోయే పిశాచి… ఇవన్నీ కలిసి మిస్టరీ థ్రిల్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ మామూలుగా ఉండవు. చూస్తుంటే వణుకు పుట్టిస్తుంది. హారర్-మిస్టరీ ఇష్టపడేవాళ్లకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. తుంబాడ్, కాంతారా ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఫోక్‌, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్ బాగా మిక్స్ చేశారు. ఒకసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు. రాత్రిపూట చూస్తే చలికాలంలోనూ చెమటలు పట్టడం గ్యారంటీ.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×