E-Paper
Advertisement

Horror movie OTT : కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి… ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

Horror movie OTT : కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి… ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
Advertisement

Horror movie OTT : క్షుద్ర పూజల నేపథ్యంలో నవీన్ చంద్ర నటించిన హారర్ థ్రిల్లర్ ‘హనీ’. ఫిబ్రవరి 6న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నడిచింది. పిల్లి మాయ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో వయొలెన్స్ కూడా ఎక్కువగానే ఉంది. కూతురితో క్షుద్రపూజలు చేసే సైకో తండ్రి కథ చుట్టూ ఈ మూవీ కథ ఉంటుంది. అందుకే చాలా మంది ఈ సినిమాను, డిజిటల్ గానే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నవీన్ చంద్ర లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ ఇవాళ రెండు ఓటీటీల్లో రిలీజైంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై జంటగా నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన్న ఈ డార్క్ హారర్ సినిమా 2026 ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చింది. ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్ ఓటీటీల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఉండగా, సన్ నెక్ట్స్ లో తెలుగు, తమిళంలో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి, రాజా రవీంద్రన్, జయన్ని వంటి తారాగణం ఉంది. ఈ సినిమాకు . అతను అంతకుముందు పలాస సినిమాకు దర్శకత్వం వహించాడు.

కథ ఏమిటంటే

Advertisement

ఆనంద్ (నవీన్ చంద్ర) మూఢ నమ్మకాల మీద ఆసక్తితో క్షుద్ర పూజలు, తాంత్రిక విద్యలు నేర్చుకుంటాడు. ఈ కారణంగానే తన ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. ఆతరువాత ఈజీగా డబ్బు సంపాదించడం కోసం క్షుద్రపూజలనే నమ్ముకుంటాడు. పిల్లి మాయ నేపథ్యం లో కథ భయంకరమైన మలుపు తీసుకుంటుంది. అయితే పిల్లి మాయ చాలా కష్టమైన తాంత్రిక విధ్య. ఆ శక్తి అంత ఈజీగా రాదు. దీని కోసం ఆడపిల్లలతో పూజలు జరిపించాలి. అందుకు తన కూతురు మీరా (జయన్ని)ను ఉపయోగించుకుంటాడు ఆనంద్. తనకి తాంత్రిక విద్యలు నేర్పిన గురువుతో కలిసి ఆనంద్ క్షుద్ర పూజలు చేస్తాడు.

దీంతో కథ హారర్ మోడ్ కి వెళ్తుంది. చివరికి ఆనంద్ చేసిన క్షుద్ర పూజలతో మీరాకి ఎలాంటి సమస్యలు వస్తాయి ? పిల్లి మాయ శక్తి ఆనంద్ కి వస్తుందా ? క్షుద్రపూజలతో ఆనంద్ డబ్బులు సంపాదిస్తాడా ? ఈ క్లైమాక్స్ ఏంటీ? అనే విషయాలను ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read  Also : దాదాపు 16 ఏళ్ల విరామం తర్వాత ఓటీటీలోకి మెడికల్ డ్రామా… 10 సీజన్లు వచ్చినా తగ్గని క్రేజ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×