E-Paper
Advertisement

శాప గ్రస్త అడవిలో ఒంటరి మహిళ… ఓటీటీని వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

శాప గ్రస్త అడవిలో ఒంటరి మహిళ… ఓటీటీని వణికిస్తున్న హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller on OTT : ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా హారర్ జానర్‌లో వచ్చే విభిన్న ప్రయత్నాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో విడుదలై, హారర్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్న డచ్ ఫోక్ హారర్ చిత్రం ‘Heresy’. ఇది థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చింది. హాలీవుడ్ క్లాసిక్ హారర్ సినిమా ‘ది విచ్’ (The Witch) తరహాలోనే అత్యంత భయంకరంగా ఉంటుంది ఈ సినిమా. మరి దీని కథ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

ఎక్కడ చూడచ్చు అంటే

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ అయిన ‘స్ట్రేంజర్ థింగ్స్’, ‘డాక్టర్ స్ట్రేంజ్ 2’ వంటి భారీ చిత్రాలకు కాన్సెప్ట్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన డిడియర్ కోనింగ్స్ (Didier Konings) ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. కేవలం 61 నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రం, ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డ్యామ్’లో ప్రదర్శితమై విమర్శకుల నుండి భారీ ప్రశంసలు అందుకుంది. డచ్ భాషలో దీనిని ‘విట్టే వీవెన్’ అని కూడా పిలుస్తారు. అంటే ‘తెల్లని దుస్తులు ధరించే అడవి శక్తులు’ అని అర్థం. ఇది 2026 మే 1 నుండి అంతర్జాతీయంగా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. Shudder, Mubi ఓటీటీలలలో దీనిని చూడచ్చు.

సినిమా కథ

Advertisement

ఈ సినిమా కథ మధ్యయుగం నాటి ఒక చిన్న, మారుమూల డచ్ గ్రామంలో జరుగుతుంది. అక్కడ నివసించే ఫ్రీడ అనే పెళ్లయిన యువతికి ఎంతకాలానికీ పిల్లలు పుట్టరు. దాంతో ఆ ఊరిలోని మతోన్మాదులు, పురుషాధిక్య సమాజం ఆమెదే తప్పు అన్నట్లు చూస్తూ, తీవ్రంగా వేధించడం మొదలుపెడతారు. సమాజం నుండి వస్తున్న నిందలు, అవమానాలను తట్టుకోలేకపోయిన ఫ్రీడ, ఎలాగైనా పిల్లాడిని కనాలని ఊరి ప్రజలు శాపగ్రస్తమైనదిగా భావించే ఒక దట్టమైన అడవిలోకి ఒంటరిగా వెళ్తుంది. ఆ నిషేధిత అడవిలోకి అడుగుపెట్టిన ఫ్రీడకు అక్కడ కొన్ని వింతైన, పురాతన శక్తులు ఎదురవుతాయి. ఆ శక్తుల ప్రభావంతో ఆమెకు భయంకరమైన శారీరక మార్పులు కలుగుతాయి. ఆ తరువాత ఏం జరిగిందనేది ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : బ్రేకప్ తో హ్యాకర్ అయ్యే దేవదాసు… మెంటలెక్కించే మలయాళం మూవీ

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×