E-Paper
Advertisement

Horror Thriller OTT : అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి… కూర వండుకుని తినే సైకో… గూస్ బంప్స్ పక్కా

Horror Thriller OTT : అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి… కూర వండుకుని తినే సైకో… గూస్ బంప్స్ పక్కా
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకు కొదవ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జోనర్ సినిమాలు, సిరీస్ లు హాల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ అయితే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సీరియల్ కిల్లింగ్ మిస్టరీ వెలికి తీసే క్రమంలో స్టోరీ భయంకర మలుపులతో సాగుతుంది. ఒక్క సారి చూస్తే ఎప్పటికీ గుర్తుకు ఉండిపోయే సిరీస్ ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

బ్రయాన్ ఫుల్లర్ రూపొందించిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ పేరు ‘హానిబాల్’ (Hannibal). ఇందులో లెక్ట‌ర్‌గా మాడ్స్ మిక్కెల్సెన్ తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. విల్ గ్రాహంగా హుగ్ డాన్సీ నటించారు. మొత్తం 3 సీజన్లు, 39 ఎపిసోడ్లతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. 2015లో ఈ సిరీస్ నిలిపివేయబడినప్పటికీ, దీనికి ఇప్పటికీ భారీ స్థాయిలో కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

విల్ గ్రాహం ఒక అసాధారణమైన ఎఫ్.బి.ఐ ఉద్యోగి. నేరస్థుల ఆలోచనా ధోరణిని పసిగట్టే ప్రత్యేక శక్తి అతనికి ఉంటుంది. ఒక సీరియల్ కిల్లింగ్ కేసును ఛేదించే క్రమంలో విల్ మానసిక స్థితి దెబ్బతినకుండా ఉండేందుకు, ఎఫ్.బి.ఐ చీఫ్ జాక్ క్రాఫోర్డ్ ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ హన్నిబాల్ లెక్టర్‌ను నియమిస్తాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. అతనికి ఒక రహస్యమైన సీక్రెట్ ఉంటుంది. హన్నిబాల్ ఒక తెలివైన వైద్యుడే కాదు, అతను ఒక నరమాంస భక్షక సీరియల్ కిల్లర్ కూడా. మనుషులను చంపి, ఆ మాంసాన్ని మటన్ ముక్కల్లా తినేస్తుంటాడు.

అతను విల్ గ్రాహంతో స్నేహం నటిస్తూనే, విల్ మానసిక స్థితిని చిన్నాభిన్నం చేస్తాడు. చివరికి తాను చేసిన హత్యలకు విల్‌ను నిందితుడిగా చేసి అతడిని జైలుకు పంపుతాడు. ఇక విల్ జైలులో ఉండి హన్నిబాల్ అసలు రూపాన్ని తెలుసుకుంటాడు. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ తరువాత కథలో మరిన్ని మలుపులు వస్తాయి. చివరికి విల్ అనుకున్నది సాధిస్తాడా ? హన్నిబాల్ నేరాలను బయట పెడతాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  శవాలతో నిండిపోయే నది… వరుస హత్యలతో వణుకు పుట్టించే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×