E-Paper
Advertisement

Horror thriller OTT : థియేటర్లో ఆడియన్స్ ను వణికించిన తమిళ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ తో గగుర్పొడిచే మిస్టరీ

Horror thriller OTT : థియేటర్లో ఆడియన్స్ ను వణికించిన తమిళ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి… గర్ల్ ఫ్రెండ్ మిస్సింగ్ తో గగుర్పొడిచే మిస్టరీ
Advertisement

Horror thriller OTT : హారర్ సినిమాలు ఇప్పుడు యామ క్రేజీగా నడుస్తున్నాయి. తమిళం, మలయాళం, తెలుగుతో పాటు ప్రతిభాషలోనూ ఈ సినిమాలను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈమధ్య సర్వం మాయ లాంటి కామెడీ హారర్ సినిమాలు కూడా 100 కోట్ల మార్కును దాటేశాయి. ఈ నేపథ్యంలో రీసెంట్గా థియేటర్లలో ఆడియన్స్ ని, తెగ భయపెట్టిన ఒక హారర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇది థియేటర్లలో రిలీజైన మూడు వారాలు తిరక్కుండానే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. ఈ సినిమాకి ఐఎండీబీలో 9.1 రేటింగ్ ఉండటం విశేషం. మొత్తానికి ఒక పాత అపార్ట్‌మెంట్ గది చుట్టూ తిరిగే సైకలాజికల్ హారర్ మిస్టరీ ఇది.

ఓటీటీలోకి ఎప్పుడంటే

ఈ తమిళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫోర్త్ ఫ్లోర్’ (Fourth Floor). ఎల్ఆర్ సుందరపాండి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆరి అర్జునన్, దీప్శిక, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించారు. మనో క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.రాజా నిర్మించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 27 థియేటర్లలో విడుదలైన 21 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. 2026 మార్చి 20న ఇది సన్ నెక్ట్స్ Sun NXT లో స్ట్రీమింగ్ కాబోతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ధీరన్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మాజీ ప్రేయసి అను నుంచి వచ్చిన ఫోన్ కాల్ వల్ల మళ్ళీ చెన్నైకి వస్తాడు. అక్కడ రాయల్ టౌన్ అనే అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో ఉన్న 4A అనే ఫ్లాట్‌లో దిగుతాడు. కానీ ఆ గదిలోకి వెళ్ళినప్పటి నుంచి అతనికి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. గది నిండా దుమ్ము పట్టడం, అంతుచిక్కని శబ్దాలు రావడం చూసి అతను కంగారు పడతాడు. ఆతరువాత తన ఎక్స్ లవర్ అను గురించి ఎంత ప్రయత్నించినా ధీరన్ తెలుసుకోలేకపోతాడు.

అయితే తన ఫ్లాట్ లో మాత్రం అను ఉన్న ఫొటో మాత్రం దొరుకుతుంది. అక్కడ ఉన్నప్పుడు అతనికి వచ్చే భయంకరమైన కలలు, దృశ్యాలు అను మిస్సింగ్ వెనుక ఉన్న మిస్టరీని గుర్తు చేస్తూ ఉంటాయి. ఆ ఫ్లాట్‌లో ఏదో అతీంద్రియ శక్తి ఉందని గ్రహించిన ధీరన్, దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అసలు అను అతనికి ఫోన్ చేసిందా ? లేక అది అతని భ్రమనా? ఆ గదిలో గతంలో ఏం జరిగింది? అనే విషయాలు సినిమా క్లైమాక్స్‌లో బయటపడతాయి.

Advertisement

Read Also : దెయ్యాలను రప్పించే కొత్త ఆట… సరదాగా మొదలై చావు దాకా… వణికిస్తున్న హారర్ థ్రిల్లర్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×