E-Paper
Advertisement

Demonte Colony 3 OTT : థియేటర్లలోకి రాకముందే ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?

Demonte Colony 3 OTT : థియేటర్లలోకి రాకముందే ఓటీటీలో… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ?
Advertisement

Demonte Colony 3 OTT : హర్రర్ మూవీ లవర్స్ విష్ లిస్ట్ లో ఉండే సినిమాలలో ‘డిమోంటీ కాలనీ’ కూడా ఒకటి. ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి ఆదరణలో ఈ ఫ్రాంచైజీలో 3వ మూవీ (Demonte Colony 3) త్వరలోనే తెరపైకి రాబోతోంది. అయితే ఇటీవల కాలంలో సినిమాలు థియేటర్లలోకి రాకముందే… ఆ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఎవరు ? ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాలను ఆరా తీసి, గుర్తు పెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘డిమోంటీ కాలనీ 3’ పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ గురించి కూడా తెలిసిపోయింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో, ఎప్పుడు రాబోతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

‘డిమోంటీ కాలనీ’ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో మూడవ భాగంగా వస్తున్న తమిళ మూవీ ‘డిమోంటీ కాలనీ 3’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అరుళ్నిధి, ప్రియా భవానీ శంకర్ ల లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కు సంబంధించిన తాజా అప్‌డేట్ కూడా వచ్చింది. జీ5 (ZEE5) ఓటీటీ ఈ చిత్రం పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది. అంటే మూవీ రిలీజ్ అయ్యాక, జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంటుందన్న మాట. ‘డిమోంటీ కాలనీ 3’ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. మొదటి రెండు పార్ట్స్ కూడా ఆయన డైరెక్షన్ లోనే వచ్చాయి. ఈ ఫ్రాంచైజీలో మేకర్స్ నాలుగు భాగాలను ప్లాన్ చేశారు. ‘డిమోంటీ కాలనీ 3’ మాత్రం ఈ ఏడాది వేసవిలో థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. మూవీ రిలీజ్ డేట్ పై ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Advertisement

Read Also :  మనుషుల్ని పురుగుల్లా చంపేసే స్పైడర్స్… ఒళ్లు జలదరించే సీన్స్ సామీ

మొదటి రెండు పార్ట్స్ స్టోరీ

‘డిమోంటీ కాలనీ’ ఫ్రాంచైజీలో వచ్చిన ఫస్ట్ రెండు సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ‘డిమోంటీ కాలనీ’ SunNXTలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక దయ్యాల బిల్డింగ్ లోకి వెళ్ళి, శాపం ఉన్న హారాన్ని తీసుకెళ్లే నలుగురు స్నేహితుల కథ ఇది. ఇందులో అరుళ్నిధి, రమేష్ తిలక్, సనత్, అభిషేక్ జోసెఫ్ జార్జ్ ప్రధాన పాత్రలు పోషించారు. రెండవ భాగం ZEE5లో ఉంది. అయితే ఇది మొదటి భాగానికి సీక్వెల్, అలాగే ప్రీక్వెల్ కూడా. ఇందులో ప్రియా భవానీ శంకర్, అరుణ్ పాండియన్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ నటించారు. మొదటి భాగంలో దెయ్యాల నుంచి తప్పించుకుంటుంది డెబి (ప్రియా భవానీ శంకర్). రెండవ భాగంలో క్యాన్సర్ కారణంగా చనిపోయిన తన భర్తను మళ్లీ బతికించాలి అనుకుంటుంది. అందుకోసం తన భర్త వీర్యంతో కృత్రిమంగా గర్భం ధరిస్తుంది. ఈ ప్రయత్నం డిమోంటీ కాలనీ దెయ్యాలు మళ్లీ ఆమెను వెంటాడతాయి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×