E-Paper
Advertisement

పెయింటింగ్‌లో బయటపడ్డ భయంకరమైన ఆత్మ… వణుకు పుట్టించే క్లైమాక్స్

పెయింటింగ్‌లో బయటపడ్డ భయంకరమైన ఆత్మ… వణుకు పుట్టించే క్లైమాక్స్
Advertisement

Horror Thriller Movie OTT : హారర్ సినిమాలు బయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. వీటికి భాషతో కూడా సంబంధం ఉండదు. ఎక్కువగా విజువల్స్, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తోనే వణికిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఒక థాయ్ హారర్ ఆడియన్స్ ను బాగానే భయపెట్టింది. ఇది ఒక దెయ్యం సినిమా మాత్రమే కాదు, ఒక మిస్టరీ థ్రిల్లర్ కూడా. ఇందులో తండ్రి చేసిన పాపాలు, కూతురికి ఎలా శాపంగా మారాయి అనే విషయాన్ని పెయింటింగ్స్ చుట్టూ చాలా భయంకరంగా చూపించారు. సినిమా అంతా డార్క్ మోడ్ లో, గగుర్పొడిచే సౌండ్ ఎఫెక్ట్స్‌తో సాగుతూ, క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్‌తో అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.

ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్

2022లో వచ్చిన ఈ థాయ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు ‘క్రాక్డ్’ (Cracked). ఈ సినిమాకు సురపాంగ్ ప్లోయెన్సాంగ్ దర్శకత్వం వహించారు. ఈ కథ నిజానికి ఒక కొరియన్ స్క్రిప్ట్ ఆధారంగా రూపొందింది. ఇందులో హీరోగా నటించిన నికున్ ఒక ప్రముఖ కే-పాప్ స్టార్. సాధారణంగా చాలా స్టైలిష్‌గా కనిపించే ఆయన, ఈ హారర్ థ్రిల్లర్ కోసం తన గ్లామర్‌ను పక్కన పెట్టి ఒక సీరియస్ ఆర్ట్ రీస్టోరర్ పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమా విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ పరంగా మంచి మార్కులు సాధించింది. కేవలం భయపెట్టడమే కాకుండా, పెయింటింగ్స్‌లోని పగుళ్ల ద్వారా కథను నడిపించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుమారు 93 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం, తక్కువ సమయంలోనే ఒక గ్రిప్పింగ్ అనుభూతిని ఇస్తుంది. ఐఎమ్‌డిబిలో 5.1 రేటింగ్ ఉన్నప్పటికీ, థాయ్ హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రుజా అనే మహిళకు తన కూతురు కంటి ఆపరేషన్ కోసం డబ్బు బాగా అవసరం అవుతుంది. అదే సమయంలో తన తండ్రి చనిపోవడంతో ఆయన ఆస్తి కోసం థాయ్‌లాండ్ వస్తుంది. అక్కడ ఆమెకు తన తండ్రి గీసిన రెండు వింతైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. వాటిని అమ్మేసి కూతురి ఆపరేషన్ చేయించాలనుకుంటుంది. కానీ ఆ పెయింటింగ్స్ మీద పగుళ్లు ఉండటంతో, వాటిని బాగు చేయడానికి టిమ్ అనే ఆర్ట్ రీస్టోరర్‌ను పిలుస్తుంది. టిమ్ ఆ పగుళ్లను బాగు చేస్తున్న కొద్దీ ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఆ పెయింటింగ్స్ వెనుక ఏదో ఒక అతీత శక్తి ఉందని. అది తమను వెంటాడుతోందని రుజాకు అర్థమవుతుంది. ఆ పగుళ్ల నుండి రక్తం రావడం, వింత శబ్దాలు వినిపించడంతో వాళ్లు బాగా భయపడతారు.

దీంతో అసలు ఆ చిత్రపటాల్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తారు. చివరికి రుజా తండ్రి గతం గురించి ఒక షాకింగ్ నిజం బయటపడుతుంది. ఆ పెయింటింగ్స్ వెనుక ఉన్నది కేవలం కళ మాత్రమే కాదు, ఒక పెద్ద శాపం అని తెలుస్తుంది. అది ఇప్పడు రుజా కూతురిని వెంటాడుతుంది. ఆ ఆత్మ నుండి తన కూతురిని కాపాడుకోవడానికి రుజా ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. క్లైమాక్స్ భయంకరమైన మలుపులతో పిచ్చెక్కిస్తుంది. అసలు ఆ శాపం ఏమిటి ? రుజా తండ్రి ఎలా చనిపోయాడు ? వెంటాడుతున్న ఆత్మ ఎవరిది ? అసలు ఆ ఆత్మ నుంచి వీళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? అనే విషయాలను మాత్రం ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఆమె కౌగిలిలో చిక్కితే ప్రాణాలు గాల్లోనే… ఈ సినిమా సింగిల్స్ కి మాత్రమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×