E-Paper
Advertisement

Horror Thriller OTT : బతికుండగానే కల్లోకొచ్చి నరకం చూపించే దెయ్యం… ఒంటరిగా చూస్తే అంతే సంగతులు

Horror Thriller OTT : బతికుండగానే కల్లోకొచ్చి నరకం చూపించే దెయ్యం… ఒంటరిగా చూస్తే అంతే సంగతులు
Advertisement

Horror Thriller OTT : ఓటీటీలో మరో హారర్ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇది థియేటర్లలో కూడా సూపర్ హిట్ అయింది. ఇది కలలో వెంటాడుతూ పిల్లల్ని మయం చేసే గ్రాబర్ అనే ఒక అతీంద్రియ శక్తి చుట్టూ తిరుగుతుంది. వీకెండ్ కి ఈ సినిమాను పిల్లలతో కలసి ప్లాన్ చేసుకోండి. మస్త్ మజా ఇస్తుంది. ఇది ఎక్కడ ఉంది, దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

స్ట్రీమింగ్ ఎందులో అంటే

ఈ అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ సినిమా పేరు ‘బ్లాక్ ఫోన్ 2’ (Black Phone 2). ఇది 2021లో వచ్చిన ‘ది బ్లాక్ ఫోన్’ కి సీక్వెల్ ఇది థియేటర్స్ లో 2025 అక్టోబర్ 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి స్కాట్ డెరిక్సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2026 జనవరి 16 నుండి Peacock, Prime Video ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో మాసన్ థేమ్స్, మడేలిన్ మెక్‌గ్రా, జెరెమీ డేవిస్, ఈతాన్ హాక్ మొదటి చిత్రం నుండి ఆ పాత్రలను తిరిగి పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $30 మిలియన్ల బడ్జెట్‌తో $132 మిలియన్లను వసూలు చేసింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గ్రాబర్‌ను ఫిన్నీ అంతం చేసిన నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కథ నడుస్తుంది. ఇప్పుడు 17 ఏళ్ల ఫిన్నీ, అతని సోదరి గ్వెన్ తమ పాత జ్ఞాపకాల నుండి బయటపడటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే గ్వెన్‌కు మళ్లీ వింతైన కలలు రావడం మొదలవుతాయి. అందులో చనిపోయిన గ్రాబర్ మళ్ళీ బ్రతికి వచ్చినట్లు కనిపిస్తాడు. వీళ్ళు ఒక వింటర్ యూత్ క్యాంప్‌కు వెళ్ళినప్పుడు, అక్కడ పిల్లలు అకస్మాత్తుగా మాయమవ్వడం మొదలవుతుంది. గ్రాబర్ ఒక అతీంద్రియ శక్తిగా మారి, వాళ్ళను వెంటాడుతున్నాడని అర్థమవుతుంది.

ఈ సీక్వెల్‌లో గ్రాబర్ కేవలం మనిషిగా మాత్రమే కాకుండా, ఒక భయంకరమైన ఆత్మగా మారి గ్వెన్ శక్తులను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు. పాత ‘బ్లాక్ ఫోన్’ మళ్ళీ రింగ్ అవుతుంది, కానీ ఈసారి అది గతంలో చనిపోయిన మనుషుల గురించి కాకుండా, భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. ఫిన్నీ, గ్వెన్ కలిసి ఈ అతీంద్రియ గ్రాబర్‌ను ఎలా అంతం చేశారనేదే ఈ సినిమా మిగతా కథ.

Advertisement

Read Also : డేవ్ బటిస్టా – జాసన్ మోమోవా క్రేజీ కామెడీ… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… ఈ కొత్త మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×