E-Paper
Advertisement

వీడియో టేపుల్లో వణికించే నిజాలు… మంత్ర తంత్రాల మధ్య మెంటల్ మాస్ సస్పెన్స్

వీడియో టేపుల్లో వణికించే నిజాలు… మంత్ర తంత్రాల మధ్య  మెంటల్ మాస్ సస్పెన్స్
Advertisement

Horror Thriller OTT : చూడాలే గాని హారర్ కంటెంట్ ఇచ్చే థ్రిల్ ఉన్న లెక్కే వెరబ్బా. సస్పెన్స్, విజువల్స్, ఊహించని మలుపులతో ఇవి కేకలు పెట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ సిరీస్ అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టాప్ రేటింగ్ కూడా పొందింది. ఐయండిబిలో దీనికి ఏకంగా 7.3 రేటింగ్ ఉంది. ఈ సిరీస్‌లో పాతకాలం నాటి కెమెరా విజువల్స్ ఉపయోగించి ప్రేక్షకులకు ఒక రకమైన భయాన్ని, ఉత్కంఠను కలిగించారు. ఒక్కో ఎపిసోడ్ మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి అయితే తీసుకెళ్తుంది.

నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ 

ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ వెబ్ సిరీస్ పేరు ‘ఆర్కైవ్ 81’ (Archive 81). ఈ కథ 2016లో వచ్చిన ఒక ఫేమస్ ఆడియో పాడ్‌కాస్ట్ ఆధారంగా పుట్టింది. నిజానికి పాడ్‌కాస్ట్‌లో అంతా ఆడియో టేపుల చుట్టూ తిరుగుతుంది. కానీ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కళ్ళకు కట్టినట్లు చూపించడం కోసం వాటిని VHS వీడియో టేపులుగా మార్చారు. ఇక సూపర్ హిట్ హారర్ సినిమాలు ‘కన్జూరింగ్’, ‘ఇన్సిడియస్’ తీసిన జేమ్స్ వాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్‌కు విమర్శకుల నుండి మంచి రేటింగ్స్ వచ్చినా, నెట్‌ఫ్లిక్స్ అనూహ్యంగా రెండో సీజన్‌ను రద్దు చేసింది. భారీ బడ్జెట్ కావడం, ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోవడమే దీనికి కారణమని అంటారు. దీనివల్ల కథ క్లైమాక్స్‌లో ఒక పెద్ద సస్పెన్స్‌తో ముగిసిపోయింది. ఇది ఎనిమిది ఎపిసోడ్స్ తో 2022 జనవరి14 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇందులో డాన్ అనే కుర్రాడు పాత పాడుబడిన వీడియో టేపులను రిపేర్ చేయడంలో దిట్ట. ఒక పెద్ద కంపెనీ వ్యక్తి వచ్చి, ఒక అగ్నిప్రమాదంలో కాలిపోయిన కొన్ని టేపులు ఉన్నాయి, వాటిని నువ్వు బాగు చేయాలని డబ్బు బాగా ఆఫర్ చేస్తాడు. ఇందుకు గాను ఒక కండిషన్ కూడా పెడతాడు. నువ్వు ఊరికి దూరంగా ఉన్న ఒక పాత ఇంట్లో ఉండి ఈ పని చేయాలి, బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదని ఒప్పందం చేసుకుంటాడు. డాన్ ఆ డబ్బు కోసం ఒప్పుకుని ఆ ఒంటరి ఇంట్లో పని మొదలుపెడతాడు.

ఆ టేపులను బాగు చేసి చూస్తుంటే, అందులో మెలోడీ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె 1994లో ఒక పాత అపార్ట్‌మెంట్‌లో జరిగే వింతల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారంతా ఏదో మంత్రాలు, తంత్రాలు చేసే ఒక కల్ట్ గ్రూపు అని ఆమెకు అర్థమవుతుంది. డాన్ ఆ టేపులు చూస్తున్న కొద్దీ, అందులో ఉన్న మెలోడీకి, తనకి ఏదో సంబంధం ఉందని, ఆమె తనని పిలుస్తోందని అతనికి అనిపిస్తుంది.

Advertisement

చివరికి డాన్‌కు అర్థమయ్యేది ఏంటంటే.. ఆ టేపుల్లో ఉన్నది కేవలం రికార్డింగ్ మాత్రమే కాదు, అది వేరే లోకానికి వెళ్లే దారి అని. ఆ కల్ట్ గ్రూపు ఒక వింత దేవుడిని భూమి మీదకు తేవాలని ప్లాన్ చేస్తుందని. వాళ్ళ మాయాజాలంలో చిక్కుకున్న మెలోడీని కాపాడదామని డాన్ ప్రయత్నిస్తాడు. కానీ సీన్ రివర్స్ అయ్యి, మెలోడీ ఈ కాలానికి వస్తుంది, డాన్ మాత్రం 1994 కాలంలోకి వెళ్లి చిక్కుకుపోతాడు. అక్కడితో కథ ఆగిపోతుంది.

Read Also : ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే వరుస హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ… అస్సలు మిస్ అవ్వకూడని సిరీస్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×