E-Paper
Advertisement

చచ్చిన శవాన్ని బతికించే వృద్దులు… రివర్స్ ఎక్సార్సిజం కాన్సెప్ట్‌తో వచ్చిన భయంకరమైన హారర్ థ్రిల్లర్

చచ్చిన శవాన్ని బతికించే వృద్దులు… రివర్స్ ఎక్సార్సిజం కాన్సెప్ట్‌తో వచ్చిన భయంకరమైన హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller OTT : దెయ్యాల సినిమాలు ఒళ్లు గగుర్పొడిచేలా అనిపిస్తాయి. వీటిని భయపడితూ ఎంటర్టైన్ అవుతుంటారు ప్రేక్షకులు. అయితే వీటిని రాత్రి పూట లైట్లు ఆఫ్ చేసి చూస్తే వచ్చే థ్రిల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే హారర్ సినిమాను అలా చూస్తే మస్త్ మజా ఇస్తుంది. ఈ సినిమాలో చనిపోయిన మనవడిని బతికించుకోవడానికి, ఒక ముసలి దంపతులు రివర్స్ ఎక్సార్సిజం చేస్తారు. అది ఎంత ప్రమాదకరంగా మారుతుందంటే చూసేవాళ్ళు భయంతో వణికిపోతారు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

2020లో వచ్చిన ఈ కెనడియన్ సూపర్ నేచురల్ హారర్ సినిమా పేరు ‘ఎనీథింగ్ ఫర్ జాక్సన్’ (Anything for Jackson). ఈ సినిమాను తెరకెక్కించిన జస్టిన్ జి. డైక్ అంతకుముందు వరకు కేవలం ఫ్యామిలీ, క్రిస్మస్ రొమాంటిక్ సినిమాలు మాత్రమే తీసేవారు. ఒక్కసారిగా అంత సాఫ్ట్ జోనర్ నుండి ఇలాంటి భయంకరమైన హారర్ సినిమా తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాకుండా సినిమా హారర్ ప్రియుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ రివ్యూ సైట్ Rotten Tomatoesలో దీనికి 98% రేటింగ్ రావడం విశేషం. ఈ సినిమా కెనడాలోని పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటన విభాగాల్లో పలు అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా shudder ఓటీటీలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

హెన్రీ, ఆడ్రీ అనే వృద్ధ దంపతులు తమ మనవడు జాక్సన్ మరణాన్ని తట్టుకోలేకపోతారు. అతను ఎలాగైనా మళ్ళీ పుట్టాలని ఒక భయంకరమైన నిర్ణయం తీసుకుంటారు. ఒక గర్భిణీ స్త్రీని కిడ్నాప్ చేసి, తమ ఇంట్లోనే బంధిస్తారు. ఒక పురాతన మంత్రాల పుస్తకం సహాయంతో, చనిపోయిన తమ మనవడి ఆత్మను ఆ పుట్టబోయే బిడ్డలోకి పంపాలని రివర్స్ ఎక్సార్సిజం చేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆ మంత్రాలు చదివే క్రమంలో వాళ్ళు తెలియకుండానే నరకపు ద్వారాలను తెరిచేస్తారు.

వాళ్ళు కోరుకున్న మనవడి ఆత్మ రాకపోగా, భయంకరమైన ఇతర దుష్టశక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆ ఆత్మలు ఆ ఇంట్లో చేరి ఆ వృద్ధ దంపతులను, కిడ్నాప్ అయిన మహిళను తీవ్రంగా భయపెడతాయి. తమ మనవడిపై ఉన్న మితిమీరిన ప్రేమ వల్ల వారు చేసిన ఈ తప్పు అదుపు తప్పుతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. చివరికి ఆ గర్భిణీ స్త్రీ అక్కడి నుండి తప్పించుకుందా? ఆ వృద్ధ దంపతులు తాము కోరుకున్నది సాధించారా? లేదా ఆ దుష్టశక్తులకు బలైపోయారా? అనే విషయాలతో ఈ క్లైమాక్స్ భయంకరంగా ముగుస్తుంది.

Advertisement

Read Also : చిన్నపిల్లల చేతిలో గన్నులు.. దేవుడు కూడా చూడలేని దారుణాలు… ఐయండిబిలో 8.6 రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×