E-Paper
Advertisement

Horror Movie OTT : హారర్ అంటే ఏంటో చూపించే అసలైన దెయ్యాల మూవీ… ఒంటరిగా చూశారో ఫసక్

Horror Movie OTT : హారర్ అంటే ఏంటో చూపించే అసలైన దెయ్యాల మూవీ… ఒంటరిగా చూశారో ఫసక్
Advertisement

Horror Movie OTT : “Üç Harfliler” అనేది టర్కీలో చాలా ప్రసిద్ధమైన హారర్ ఫ్రాంచైజ్. టర్కిష్ సంస్కృతిలో జిన్ అనే పదాన్ని నేరుగా ఉచ్చరించకూడదనే నమ్మకం వల్ల దాన్ని “üç harfli” అని పిలుస్తారు. ఈ సిరీస్ ఎక్కువగా చేతబడి, శాపాలు, ఆత్మల చుట్టూ తిరుగుతాయి. అల్పర్ మెస్టి దర్శకత్వంలో చాలా ఫిల్మ్స్ వచ్చాయి. ఇది తుర్కీ హారర్‌లో Siccin సిరీస్ తర్వాత రెండో పెద్ద హిట్ సిరీస్‌గా పేరు పొందింది. మరి ఈ హారర్ సినిమాలను చూడాలనుకుంటే ఓ లుక్ వేయండి. ఒంటరిగా మాత్రం చూసే ధైర్యం అయితే చేయకండి. ఎందుకంటే వెన్నులో వణుకు పుట్టించే సీన్స్ కి ఈ ఫ్రాంచైజి ప్రసిద్ది.

ఈ సిరీస్‌లోని ప్రధాన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. 

Üç Harfliler: Marid (2010) : ఈ హారర్ సిరీస్ లలో మొదటి ఫిల్మ్ ఇది. ఒక కుటుంబంపై ఆత్మ ప్రభావం చూపడం చుట్టూ కథ తిరుగుతుంది.

Advertisement

Üç Harfliler 2: Hablis (2015) : పాత ఇంట్లోకి మారిన ఒక కుటుంబానికి ఎదురైన భయంకరమైన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది.

Üç Harfliler 3: Karabüyü (2016) : ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) వల్ల తలెత్తే పరిణామాలను భయంకరంగా చూపిస్తుంది.

Advertisement

Üç Harfliler: Beddua (2018) : తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఒక అమ్మాయి ఆత్మను పిలుస్తుంది. ఆ తరువాత ఆత్మ టార్గెట్ వెతుకుతుంది. ఈ సినిమా కూడా వణుకు పుట్టిస్తుంది.

Üç Harfliler: Adak (2019) : వింత ఆచారాలతో ప్రమాదంలో పడిన ఒక వ్యక్తి కథ ఇది. దాని నుంచి కోలుకోవాలని ప్రయత్నించే సంఘటనలతో కథ ఉంటుంది.

Üç Harfliler: Nazar (2024) : సంతానం కోసం మంత్రశక్తులతో ఒప్పందం చేసుకున్న కుటుంబం అనుభవించే కష్టాలతో ఈ సినిమా ఉంటుంది.

Üç Harfliler: Fal (2025) : ఇక తాజా చిత్రం 2025 మార్చిలో థియేటర్స్‌లో విడుదల అయింది. కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన ఇరేమ్ తన అమ్మమ్మ మరణం తర్వాత హాంటింగ్ ఎదుర్కొంటుంది. ఇది ఈ ఏడాది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఫిల్మ్స్ చాలా ఎక్కువగా YouTubeలో అందుబాటులో ఉన్నాయి.

Read Also : మహిళల్ని మాత్రమే చంపే మాస్క్ మ్యాన్… ఆ పార్ట్స్ కట్ చేసి అరాచకం భయ్యా… లాస్ట్ ట్విస్టుకు మైండ్ పోవడం పక్కా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×