E-Paper
Advertisement

Horror Movie OTT : ఆ మూడు శవాల్లో అసలైన దెయ్యం ఏది? ఓటీటీలో వచ్చేస్తున్న దెయ్యం సినిమా… కనురెప్ప వేయనివ్వని హారర్ కథ

Horror Movie OTT : ఆ మూడు శవాల్లో అసలైన దెయ్యం ఏది? ఓటీటీలో వచ్చేస్తున్న దెయ్యం సినిమా… కనురెప్ప వేయనివ్వని హారర్ కథ
Advertisement

Horror Movie OTT : మోర్చురీ నేపథ్యంలో ఒక గేమ్ బాగా పాపులర్ అయింది. 2022లో ఈ గేమ్ విడుదలైనప్పుడు యూట్యూబ్, ట్విచ్‌లలో స్ట్రీమర్స్ దీన్ని విపరీతంగా ఆడటంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. 2026లో ఈ గేమ్ ఆధారంగా వచ్చిన సినిమా కూడా, హర్రర్ ప్రియుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయని రివ్యూలు కూడా వచ్చాయి. సుమారు 1 గంట 40 నిమిషాల పాటు ఈ సినిమా సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తుంది. గేమ్‌లో ఉన్న ఎంబాల్మింగ్ (శవాలను శుభ్రం చేసే) ప్రక్రియను సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. అందుకే ఈ సినిమా మిమ్మల్ని బాగా భయపెడుతుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది మోర్చురీ అసిస్టెంట్’ (The Mortuary Assistant). ఇది అదే పేరుతో వచ్చిన పాపులర్ వీడియో గేమ్ ఆధారంగా రూపొందింది. జెరెమియా కిప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విల్లా హాలండ్, పాల్ స్పార్క్స్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మార్చి 27 నుండి Shudder ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రెబెక్కా అనే యువతి ఒక శవాల గదిలో (మోర్చురీ) అసిస్టెంట్‌గా చేరుతుంది. ఒకరోజు రాత్రి ఆమె బాస్ రేమండ్ ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తూ, మోర్చురీలో ఉన్న మూడు శవాలకు ఎంబాల్మింగ్ (శవాలు కుళ్లిపోకుండా చేసే ప్రక్రియ) పూర్తి చేయమని రెబెక్కాకు చెప్పి వెళ్తాడు. ఒంటరిగా ఆ రాత్రి పని మొదలుపెట్టిన రెబెక్కాకు అక్కడ వింత వింత శబ్దాలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. అసలు విషయం ఏమిటంటే, ఆ మూడు శవాలలో ఒకదానిలో ఒక క్రూరమైన దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం రెబెక్కా గతాన్ని, ఆమె బలహీనతలను వాడుకుని ఆమెను మానసికంగా దెబ్బతీయాలని చూస్తుంది.

అయితే ఆ రాత్రి గడవకముందే ఏ శవంలో దెయ్యం ఉందో కనిపెట్టి, దహనం చేయకపోతే, ఆ దెయ్యం రెబెక్కా శరీరాన్ని ఆవహిస్తుందని ఆమెకు అర్థమవుతుంది. ప్రాణాల మీద ఆశతో దెయ్యం పెట్టే భయంకరమైన పరీక్షలను తట్టుకుంటూ ఆమె ప్రతి శవాన్ని పరిశీలిస్తుంది. చివరికి ఆ శవాలలో ఎందులో దయ్యం ఉంది ? రెబెక్కా దానిని కనిపెడుతుందా ? లేదా దాని వశం అవుతుందా ? అసలు ఆ భయంకరమైన రాత్రిని రెబెక్కా ఎలా ఎదుర్కొంది ? అనే విషయాలను, ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  మసాజ్ చేస్తూ మర్డర్లు చేసే సైకో కిల్లర్… ఉత్కంఠ రేపుతున్న పాకిస్తానీ మూవీ… ఐయండిబిలో 9.4 రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×