E-Paper
Advertisement

Horror Movie OTT: అగచాట్లు పెట్టే పిల్ల పిశాచి… గుండె దడ పెంచే సీన్లు… వణికించే సౌండ్లు

Horror Movie OTT: అగచాట్లు పెట్టే పిల్ల పిశాచి… గుండె దడ పెంచే సీన్లు… వణికించే సౌండ్లు
Advertisement

Horror Movie OTT : కొరియాలో రొమాంటిక్ సినిమాలు ఫేమస్. ఇక్కడి నుంచి దెయ్యాల సినిమాలు తక్కువే. అయితే హర్రర్ సినిమాలకు అంతగా ఆదరణ ఉండని సమయంలో, ఒక దెయ్యం సినిమా వచ్చి సంచలనం సృష్టించింది. ఇది విడుదలైన కొద్ది రోజుల్లోనే 10 లక్షల మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి పెద్ద హిట్ కొట్టింది. ఇది మనుషుల స్వరం మారుస్తూ బలితీసుకునే దెయ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు వచ్చే సౌండ్స్ కు సగం ప్రాణాలు పోతాయి. థియేటర్లలో చాలా భయానకంగా సౌండ్ ఎఫ్ఫెక్ట్ ఉంటుంది.

స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఈ కొరియా హర్రర్ మూవీ పేరు ‘ది మిమిక్’ (The Mimic). 2017లో వచ్చిన ఈ సినిమా హు జంగ్ దర్శకత్వంలో, కొరియన్ జానపద కథ ఆధారంగా రూపొందింది. ఇందులో యమ్ జంగ్-ఆహ్, హ్యూక్-క్వాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix), ప్రైమ్ వీడియో (Prime Video) ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ప్రధాన పాత్రలో నటించిన యమ్ జంగ్-ఆహ్ నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. కొడుకును కోల్పోయిన తల్లి పడే ఆవేదనను, భయాన్ని ఆమె చాలా బాగా పండించారు ఇందులో.

స్టోరీ ఏమిటంటే

Advertisement

యోన్ అనే మహిళ తన చిన్న కొడుకు ఐదేళ్ల క్రితం తప్పిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకోలేకపోతుంది. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి తన కుటుంబంతో కలిసి నగరం వదిలి, అడవికి దగ్గరగా ఉండే ఒక ఊరికి మారుతుంది. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా, ఆమెకు ఒక చిన్న అమ్మాయి ఒంటరిగా కనిపిస్తుంది. ఆ పిల్ల పరిస్థితి చూసి జాలిపడి, తన ఇంటికి తీసుకువచ్చి ఆశ్రయం ఇస్తుంది. ఇక సినిమాలో  అసలు కథ మొదలవుతుంది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పటి నుండి వింత సంఘటనలు మొదలవుతాయి.

ఆశ్చర్యకరంగా, ఆ అమ్మాయి హీ-యోన్ కూతురు గొంతును అచ్చం అలాగే మాట్లాడటం మొదలుపెడుతుంది. అదే సమయంలో, ఆ ప్రాంతంలోని ఒక పాత గుహ గురించి భయంకరమైన నిజాలు బయటపడతాయి. అక్కడ ఉండే ఒక అతీంద్రియ శక్తి మనుషుల గొంతులను అనుకరిస్తూ, వాళ్ళ ప్రాణాలు తీస్తుందని తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చివరికి ఆ చిన్న పాప యోన్ ప్రాణాలను కూడా తీస్తుందా ? ఆ పాపలో ఉన్న దెయ్యం ఎంత మందిని చంపుతుంది ? దీనికి అంతం లేదా ? ఈ కథ ముగింపు ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also :  ప్రతి ఉదయం ఒక కొత్త పరిచయం… గతం మరిచే ప్రియురాలి కోసం ప్రియుడి తపన… మళ్లీ మళ్లీ మొదలయ్యే ప్రేమ

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×