E-Paper
Advertisement

Horror Move OTT: రక్తం తాగే జోంబీలు… ఊరంతా ఉక్కిరిబిక్కిరి… క్రాక్ ఎక్కించే క్లైమాక్స్

Horror Move OTT:  రక్తం తాగే జోంబీలు… ఊరంతా ఉక్కిరిబిక్కిరి… క్రాక్ ఎక్కించే క్లైమాక్స్
Advertisement

Horror Move OTT : జోంబీ సినిమాలంటే రక్తపాతం ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే హంస కూడా అంతకుమించి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలో ఈ రెండు మోతాదుకు మించి ఉంటాయి. జాంబీలతో నిండిన ఈ ప్రపంచంలో ఒక అపార్ట్మెంట్లో చిక్కుకున్న ఒక యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. కొరియాలో బ్లాక్బస్టర్ అయిన ఈ మూవీ, ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. జాంబి ఫ్యాన్స్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మరి ఈ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే…

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

2020లో వచ్చిన ఈ కొరియన్ జోంబీ థ్రిల్లర్ సినిమా పేరు Alive. చో ఇల్-హ్యూంగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యూ ఆహ్-ఇన్, పార్క్ షిన్-హై లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Netflix లో అందుబాటులో ఉంది. 2020లో కరోనా మహమ్మారి సమయంలో థియేటర్లలో విడుదలైన మొదటి పెద్ద సినిమా కూడా ఇదే. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో టాప్ 1 స్థానంలో నిలిచిన మొదటి కొరియన్ సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇది కొరియాలో దాదాపు 13.4 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

సిటీలో అకస్మాత్తుగా ఒక వింత వైరస్ వ్యాపించి, మనుషులందరూ రక్తపిపాసుల్లా మారుతుంటారు. ఈ సమయంలో హీరో జూన్-వూ తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా చిక్కుకుపోతాడు. బయట అడుగు పెడితే చావు ఖాయమని తెలిసి, ఇంట్లోనే తలుపులు వేసుకుని ఉండిపోతాడు. కానీ రోజులు గడిచేకొద్దీ ఇంట్లో తిండి, నీళ్లు అయిపోతాయి. దాంతో పాటు బయట ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోతాయి. ఇక తను బ్రతకడం కష్టమని నిరాశలో ఉన్న సమయంలో, ఎదురు అపార్ట్‌మెంట్‌లో యూ-బిన్ అనే అమ్మాయి ప్రాణాలతో ఉన్నట్లు గమనిస్తాడు. ఇక్కడి నుంచి స్టోరీ మలుపు తిరుగుతుంది.

ఆ అమ్మాయిని చూశాక హీరోలో కొత్త ఆశ పుడుతుంది. ఇద్దరూ కలిసి ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ, అపార్ట్‌మెంట్‌లోని జోంబీల కళ్లు గప్పి బతకడానికి పోరాడుతారు. ఒకానొక దశలో ఇంట్లో ఉండటం కంటే బయటకు వచ్చి పోరాడటమే మేలని నిర్ణయించుకుంటారు. చేతికి దొరికిన ఆయుధాలతో ప్రాణాలకు తెగించి పోరాడుతారు ఆ జోంబీలతో. ఇక చివరగా వీళ్ళు ప్రాణాలతో బయట పడతారా ? ఎవరైనా వీళ్ళను కాపాడుతారా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ప్రేమ పేరుతో బురిడి… భర్త హత్యకు ప్రియుడితో స్కెచ్… బుర్ర గిర్రున తిరిగే ట్విస్టులు

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×