E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిలతో ఆ పని కోసం హోటల్ కి వెళ్తే, ఆడ పిశాచికి బలి… ఈ హారర్ కథా చిత్రమ్ చూస్తే నిద్ర పట్టడం కష్టమే భయ్యా

OTT Movie : అమ్మాయిలతో ఆ పని కోసం హోటల్ కి వెళ్తే, ఆడ పిశాచికి బలి… ఈ హారర్ కథా చిత్రమ్ చూస్తే నిద్ర పట్టడం కష్టమే భయ్యా
Advertisement

OTT Movie : హర్రర్ అనే పదం వింటే చాలు, హాలీవుడ్ మూవీసే ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ ఇలాంటి సినిమాలను మన వాళ్ళు కూడా ఎన్నో తీసి, హాలీవుడ్ కి తీసిపోము అని నిరూపించారు. అలా నిరూపించిన సినిమాలలో ఓ బెస్ట్ హర్రర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే…

యూట్యూబ్ (Youtube) లో

Advertisement

ఎన్నో హర్రర్ సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అన్నీ భయపడతాయా అంటే కచ్చితంగా కాదు. కొన్ని సినిమాలైతే ఎందుకు చూసామో కూడా అర్థం కాదు. కానీ కొన్ని హర్రర్ సినిమాలు చూశాక సాటిస్ఫై అవ్వడమే కాదు వర్క్ వాచింగ్ మావా అని ఇంకొకరికి కూడా సజెస్ట్ చేసేలా ఉంటాయి. అలాంటి మూవీనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా. ఈ మూవీ పేరు ‘హర్రర్ కథ చిత్రం’ (Horror katha chitram). ప్రస్తుతం యూట్యూబ్ (Youtube) లో తెలుగుతో పాటు హిందీలోనూ ఫ్రీగానే ఈ మూవీని చూడొచ్చు. చాలా కాలం క్రితమే రిలీజ్ అయిన ఈ మూవీలో కరణ్ కుంద్ర, నందిని వైద్, రవిష్ దేశాయ్, హసన్ జైదీ, నిశాంత్ మల్కానీ, శీతల్ సింగ్, అపర్ణ బాజ్పాయ్, రాధిక మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆయుష్ రైనా దర్శకత్వం వహించగా, వినోద్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు.

స్టోరీ లోకి వెళ్తే….

Advertisement

మూవీ మొదట్లోనే ఓ వ్యక్తి ఓ బిల్డింగ్ మీదకు వెళ్లి, అక్కడినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. కట్ చేస్తే… ఓ పబ్ లో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు మందు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. ఆ టైంలోనే టీవీలో ఓ వ్యక్తి బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయాడని వార్త వస్తుంది. ఇదంతా చూసి ఆ గ్యాంగ్ లోని ఒకడు హోటల్ గ్రాండ్యుయర్స్ గురించి న్యూస్ లో చెప్తున్నారు. ఆ హోటల్లో ఆత్మహత్యలు స్టార్ట్ కావడంతో క్లోజ్ చేశారు. ఆ తర్వాత దాని ఓనర్ సూసైడ్ చేసుకున్నాడా, లేదంటే ఎవరైనా చంపారా అనేది ఎవరికీ తెలీదు. కానీ అప్పటినుంచి ఇలా జరుగుతూనే ఉంది అని గతంలో జరిగిన స్టోరీని చెప్తాడు. ఇక అందరూ కలిసి ఆ హోటల్ చాలా భయంకరమైందని, దాని గురించి చాలా భయంకరమైన స్టోరీలు విన్నామని మాట్లాడుకుంటారు. అందరూ కలిసి హోటల్ గ్రాండ్యుయర్స్ కి వెళ్లి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు.

చివరికి అందరూ  కలిసి అదే హోటల్ కి వెళ్తారు. కానీ ఆ హోటల్ డోర్ లాక్ చేసి ఉంటుంది. తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో, లోపలి నుంచి ఏదో సౌండ్ రావడం గమనిస్తారు అందరూ. దీంతో లోపల ఎవరో ఉన్నారనే ఉద్దేశంతో అందరూ కలిసి బ్యాక్ డోర్ నుంచి లోపల వెళ్తారు. ఆ తర్వాత స్టోరీ అసలైన మలుపు తిరుగుతుంది. ట్విస్టులు, టర్న్ లతో స్టోరీ హడలెత్తిస్తుంది. ఒక్కొక్కరికి సపరేట్గా అక్కడ భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. మరి చివరికి ఆ దయ్యం నుంచి వీళ్లంతా తప్పించుకొని బయటపడగలిగారా? అక్కడ ఎలాంటి సమస్యలను ఫేస్ చేశారు? చివరికి ఏం జరిగింది? అనేది ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×