E-Paper
Advertisement

Horror Comedy OTT : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Horror Comedy OTT : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా
Advertisement

Horror Comedy OTT : జోంబీ సినిమాలంటే రక్తపాతం ఓ రేంజ్ లో ఉంటుంది. ఇలాంటి సినిమాలలో హింస బీభత్సం గా సాగుతుంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ సినిమా, జాంబీ సినిమాల్లా భయంకరంగా ఉండదు. ఈ వైరస్ బారిన పడిన తన కుమార్తెను రక్షించడానికి తండ్రి పడే తపనను కామెడీతో కలిపి చూపిస్తుంది ఈ సినిమా. ఇది థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కూడా అయింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కొరియన్ జోంబీ కామెడీ చిత్రం పేరు ‘మై డాటర్ ఈజ్ ఎ జోంబీ’ (My Daughter Is a Zombie). ఇది 2025 జూలై 30న థియేటర్లలో విడుదలై $38 మిలియన్లు వసూలు చేసింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన కొరియా చిత్రంగా కూడా నిలిచింది. దీనికి పిల్ గామ్-సంగ్ దర్శకత్వం వహించారు. ఇందులో జో జంగ్-సుక్, లీ జంగ్-యున్, చో యో-జియోంగ్, యూన్ క్యుంగ్-హో, చోయ్ యు-రి నటించారు. ఈ సినిమా ప్రస్తుతం Viki ఓటీటీలో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో అద్దెకు మాత్రమే ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సియోల్ సిటీలో ఒక్కసారిగా జాంబీ వైరస్ అటాక్ చేస్తుంది. ఈ గందరగోళంలో హీరో లీ జియాంగ్-హ్వాన్ కూతురు సూ-ఆకి కూడా వైరస్ సోకి ఆమె జాంబీగా మారిపోతుంది. సాధారణంగా జాంబీ అంటే చంపేయాలి లేదా పారిపోవాలి, కానీ ఆ తండ్రికి తన కూతురిని వదులుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఎవరికీ తెలియకుండా ఆమెను తీసుకుని ఊర్లో ఉండే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆమెను ఒక గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ, ఆమెకు మళ్ళీ మనుషుల అలవాట్లు నేర్పించడానికి రకరకాల తిప్పలు పడుతుంటాడు.

ఈ క్రమంలో జరిగే సన్నివేశాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. కూతురు జాంబీలా మీద పడకుండా ఆమెకు శిక్షణ ఇవ్వడం. ఇంట్లో ఉండే బామ్మ చేసే పనులు, ఇలా సినిమా అంతా కామెడీగా సాగుతుంది. అయితే కేవలం నవ్వించడమే కాకుండా, తన కూతురు మళ్ళీ మామూలు మనిషి అవుతుందనే ఆశతో ఆ తండ్రి పడే తపన చూస్తుంటే ఒక పక్క నవ్వు వస్తూనే మరో పక్క కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. చివరికి ఆ తండ్రి తన కూతురిని కాపాడుకున్నాడా ? ఆమె మామూలు మనిషిగా మారుతుందా ? అనే విషయాలను,ఈ కొరియా జోంబీ కామెడీ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చైనీస్ ఫాంటసీ యానిమేటెడ్ మూవీ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×