E-Paper
Advertisement

Horror comedy OTT: డబ్బు కోసం దిక్కుమాలిన ఐడియా… దెయ్యాలతో తన్నులు… అంతా ఆ యంత్రంతోనే

Horror comedy OTT: డబ్బు కోసం దిక్కుమాలిన ఐడియా… దెయ్యాలతో తన్నులు… అంతా ఆ యంత్రంతోనే
Advertisement

Horror comedy OTT : హారర్ కామెడీ జానర్ లో వచ్చే సినిమాలు ప్రేక్షకుల నుంచి అయితే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలు కామెడీతో పరుగులు పెట్టిస్తుంటాయి కూడా. ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమా బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఈ కథ ముగ్గురు నిరుద్యోగ యువకుల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2017లో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన తెలుగు హారర్ కామెడీ ‘ఆనందో బ్రహ్మ’ కు రీమేక్ గా వచ్చింది. తెలుగులో దెయ్యాలు మనుషులకు భయపడటం అనే కాన్సెప్ట్ ఎంతలా నవ్వించిందో, బెంగాలీలో కూడా అదే పంథాను అనుసరించారు. మరి ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ బెంగాలీ అడ్వెంచర్ హారర్ కామెడీ చిత్రం పేరు ‘భూతచక్ర ప్రైవేట్ లిమిటెడ్’ (Bhootchakra Pvt. Ltd.). 2019లో విడుదలైన ఈ సినిమా 2017లో వచ్చిన సూపర్ హిట్ తెలుగు చిత్రం ఆనందో బ్రహ్మ కు రీమేక్. ఇందులో సోహమ్ చక్రవర్తి, బోనీ సేన్‌గుప్తా, గౌరవ్ చక్రబర్తి, స్రబంతి ఛటర్జీ, రిత్తికా సేన్, కౌశిక్ సేన్, పరణ్ బందోపాధ్యాయ, శాంతిలాల్ ముఖర్జీ నటించారు. హరనాథ్ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2019 జూలై 5న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సింపుల్‌గా చెప్పాలంటే, ఈ సినిమా కథ ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు ముగ్గురూ లైఫ్‌లో సెటిల్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక రోజు పొరపాటున వీళ్ళకు దెయ్యాలను కనిపెట్టే ఒక వింత యంత్రం దొరుకుతుంది. దాంతో వీళ్ళు ‘భూతచక్ర ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ పెట్టి, తాము పెద్ద ఘోస్ట్ హంటర్స్ అని బిల్డప్ ఇచ్చి, ఊర్లో వాళ్లను బురిడీ కొట్టించి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇక ట్విస్ట్ ఏంటంటే.. ఒక పాత బంగళాలో దెయ్యం ఉందనే విషయం తెలిసి, వీళ్ళు నకిలీ వేషాలతో అక్కడికి వెళ్తారు. అక్కడ నిజంగానే కొన్ని ఆత్మలు ఉంటాయని తెలిశాక, వీళ్ళు భయంతో పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ఆత్మలకు ఒక గతం ఉందని, అవి తమకు సాయం చేయమని అడుగుతున్నాయని అర్థమవుతుంది వీళ్ళకి. ఆ తర్వాత ఆ దెయ్యాలతో కలిసి వీళ్ళు చేసే కామెడీ, ఆ ఆత్మల కోరికను వీళ్ళు ఎలా తీర్చారు ? అనే అంశాలతో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది.

Read Also : పూల తోటలో మృతదేహాలు… ప్రేమలో పడ్డ అమ్మాయిని కూడా… ఈ ఆరు ఎపిసోడ్‌ల క్రైమ్ థ్రిల్లర్ భీభత్సమే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×