E-Paper
Advertisement

OTT Movie : వీడికి పెళ్లి జరుగుతుంది… కానీ మొదటి రాత్రే… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : వీడికి పెళ్లి జరుగుతుంది… కానీ మొదటి రాత్రే… కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : ఫ్యామిలీ డ్రామా తో వచ్చే కామెడీ సినిమాలను చూసి బాగా ఎంటర్టైన్ అవుతారు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో కొత్తగా పెళ్లయిన జంట హనీమూన్ కి వెళ్లడానికి ట్రై చేస్తారు. అయితే ఆ కుటుంబంలో హనీమూన్ అంటే ఏమిటో తెలియక, ఇంట్లో వాళ్ళందరూ మేము కూడా వస్తామని చెప్తారు. వీళ్ళందరూ కలిసి హనీమూన్ కి వెళ్తారు. అక్కడ జరిగే కామిడీ సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది.  ఈ ఫ్యామిలీ డ్రామా కామెడీ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

నెట్ఫ్లిక్స్ (Netflix) లో

Advertisement

ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘హనీమూన్‘ (Honeymoon).  2022 లో వచ్చిన ఈ మూవీకి అమర్ ప్రీత్ ఛబ్రా దర్శకత్వం వహించారు.ఈ మూవీలో  గిప్పీ గ్రేవాల్, జాస్మిన్ భాసిన్, కరమ్‌జిత్ అన్మోల్, నాసిర్ చిన్యోతి, నరేష్ కథూరియా ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

విశాల్ ఫ్యామిలీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్యాన్ తిరగట్లేదని ఎలక్ట్రిషన్ ని పిలిపిస్తారు. అయితే కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందని, ఎలక్ట్రిషన్ వాళ్ళ మీద కోప్పడతాడు. కరెంట్ బిల్లు కట్టకపోవడంతో కనెక్షన్ కట్ చేసి ఉంటారు. ఆ తర్వాత కరెంట్ బిల్లు కట్టడానికి విశాల్ వెళ్తాడు. ఇంతలో అటుగా వెళుతున్న గీత అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అతని బాబాయ్ తో ఈ విషయం చెప్పి, అతన్ని కూడా తోడు తీసుకొని గీత ఇంటికి వెళ్తాడు. వాళ్ళింట్లో కూడా కరెంట్ ప్రాబ్లం ఉండటంతో, వచ్చింది కరెంట్ వాళ్లే అని గీత అమ్మ వాళ్ళని రిపేర్ చేయమని చెప్తుంది. గీతను చూడాలనే ఉద్దేశంతో వచ్చిన విశాల్, కరెంట్ రిపేర్ చేస్తానని గీత దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేస్తాడు. అలా కొద్ది రోజులకి వీళ్లిద్దరి పెళ్లి కూడా జరిగిపోతుంది. అయితే శోభనం రోజు ఇంట్లో వాళ్ళందరూ తాగి శోభనం గదిలో నిద్రపోతారు. ఇంట్లో మొదటి రాత్రి చేసుకోవడానికి సమయం కూడా దొరకకుండా పోతుంది. ఈ క్రమంలో ఈ జంట హనీమూన్ కి వెళ్లాలనుకుంటారు. ఇంట్లో వాళ్లకి హనీమూన్ అంటే ఏమిటో తెలియకపోవడంతో, మేము కూడా మీతో పాటు వస్తామని చెప్తారు. అలా వీళ్ళందర్నీ కూడా లండన్ కి తీసుకువెళ్తాడు విశాల్.

వీళ్ళది సాధారణ కుటుంబమే అయినా, వీరి పొలం మీదుగా ఎయిర్పోర్ట్ పడుతుందని సమాచారం రావడంతో భూమి ధర పెరిగిపోతుంది. కోడలు రావడంతోనే అదృష్టం వచ్చిందని అంతా భావిస్తారు. డబ్బులు ఎక్కువ అవుతున్నా, ఆ ధైర్యంతోనే వీళ్ళు లండన్ కి ప్లాన్ చేస్తారు. అయితే లండన్ లో కూడా వీళ్ళ హనుమాన్ కి ఇంట్లో పెద్దలు అడ్డుపడుతూ వుంటారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ పడట్లేదని సమాచారం వస్తుంది. పొలం ధర కూడా ఒక్కసారిగా పడిపోతుంది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు అంతా హనీమూన్ నుంచి వచ్చేస్తారు. కోడలు అడుగు పెట్టడంతోనే ఇన్ని కష్టాలు వస్తున్నాయని అనుకుంటారు. ఈ మాటలు విన్న కోడలు ఒక డెసిషన్ తీసుకుంటుంది. భర్తను వదిలి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. చివరికి విశాల్ భార్య మళ్లీ కాపురానికి వస్తుందా? వీళ్ళ హనీమూన్ జరుగుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘హనీమూన్’ (Honeymoon) ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×