E-Paper
Advertisement

Oscars 2026 : ఆస్కార్ కి షార్ట్‌లిస్ట్ అయిన ‘హోమ్‌బౌండ్’ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

Oscars 2026 : ఆస్కార్ కి షార్ట్‌లిస్ట్ అయిన ‘హోమ్‌బౌండ్’ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Advertisement

Oscars 2026 : ఆస్కార్ నామినేషన్లలో ఈ ఏడాది ఇండియా నుంచి ఏఏ సినిమాలు సెలెక్ట్ అవుతాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. తాజా సమాచారం ప్రకారం, 98వ అకాడమీ అవార్డులు అంటే ఆస్కార్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి హిందీ చిత్రం ‘హోమ్‌బౌండ్’ (Homebound) షార్ట్‌లిస్ట్ అయ్యిందని ప్రకటించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం 12 విభాగాలలో షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించింది.

షార్ట్ లిస్ట్ అయిన సినిమాలు ఇవే

ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో, 15 సినిమాలు తుది నామినేషన్లకు అర్హత సాధించాయి. బాలీవుడ్ చిత్రం ఈ ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకుంది. తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటిస్తారు. ‘హోమ్‌బౌండ్‌’తో పాటు షార్ట్‌లిస్ట్ అయిన ఇతర చిత్రాలలో అర్జెంటీనాకు చెందిన ‘బెలెన్’, బ్రెజిల్‌కు చెందిన ‘ది సీక్రెట్ ఏజెంట్’, ఫ్రాన్స్‌కు చెందిన ‘ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్’, జర్మనీకి చెందిన ‘సౌండ్ ఆఫ్ ఫాలింగ్’, ఇరాక్‌ నుంచి ‘ది ప్రెసిడెంట్స్ కేక్’, జపాన్‌ నుంచి ‘కొకుహో’, జోర్డాన్‌ నుంచి ‘ఆల్ దట్స్ లెఫ్ట్ ఆఫ్ యు’, నార్వే నుంచి ‘సెంటిమెంటల్ వాల్యూ’, పాలస్తీనా నుంచి ‘పాలస్తీనా 36’, దక్షిణ కొరియా నుంచి ‘నో అదర్ ఛాయిస్’, స్పెయిన్‌ నుంచి ‘సిరాట్’, స్విట్జర్లాండ్‌ నుంచి ‘లేట్ షిఫ్ట్’, తైవాన్‌ నుంచి ‘లెఫ్ట్-హ్యాండెడ్ గర్ల్’, ట్యునీషియా నుంచి ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్’ అనే సినిమాలు ఉన్నాయి.

Advertisement

Read Also :  ఫన్ కోసం 9 ఏళ్ల పాపతో 17 ఏళ్ల అమ్మాయి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే సిరీస్ మావా… బెస్ట్ కొరియన్ మాస్టర్ పీస్

హోమ్ బౌండ్ స్ట్రీమింగ్ ఇక్కడే

98వ అకాడమీ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘హోమ్‌బౌండ్’ భారతదేశం నుండి అధికారిక ఎంట్రీ పొందడం నిజంగా గర్వకారణం. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం భారతదేశంలోని కుల, మతపరమైన పక్షపాతాలను కళ్ళకు కట్టారు. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో ప్రసారం అవుతోంది.

Advertisement

COVID-19 లాక్‌డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించే ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ స్నేహితుల చందన్ (దళితుడు), షోయిబ్ (ముస్లిం) హృదయ విదారక కథ ఇది. సామాజిక అసమానతలు, కుల వివక్ష, పేదరికం, ఆకస్మికంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కలిగే కష్టాలను ఇందులో చూడవచ్చు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×