E-Paper
Advertisement

పిజ్జా దొరకకపోతే ప్రాణాలు పోయేలా… ప్రతి పదిహేను నిమిషాలకు మారే వింత

పిజ్జా దొరకకపోతే ప్రాణాలు పోయేలా… ప్రతి పదిహేను నిమిషాలకు మారే వింత
Advertisement

Comdy Movie OTT : ఓటీటీలోకి ఒక హాలీవుడ్ కామెడీ సినిమా మరికొద్ది గంటల్లో అడుగుపెట్టేస్తోంది. ఇది థియేటర్లకు వెళ్ళకుండా నేరుగా డిజిటల్ ఆడియన్స్ ను పలకరిస్తోంది. ఈ సినిమా రన్ టైమ్ సుమారు 1 గంట 32 నిమిషాలు ఉంటుంది. అయితే ఇందులో ఎక్కువ శాతం కడుపుబ్బా నవ్వించే సీన్లే ఉంటాయి. ఇద్దరు కాలేజీ రూమ్‌మేట్స్ ఒక వింత డ్రగ్‌ను సేవించిన తర్వాత, వాళ్ళు ఆర్డర్ చేసిన పిజ్జాని రిసీవ్ చేసుకోవడానికి వెళ్లే క్రమంలో ఎదురయ్యే వింతైన, నవ్వు పుట్టించే సంఘటనల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఇందులో మాట్లాడే సీతాకొక చిలుక తో కామెడీ పీక్స్ కు వెళ్తుంది.

ఏ ఓటీటీలో చూడచ్చు అంటే

ఈ అమెరికన్ స్టోనర్ కామెడీ సినిమా పేరు ‘పిజ్జా మూవీ’ (Pizza Movie). ఈ సినిమాను బ్రయాన్ మెక్ఎల్హానీ, నిక్ కోచర్ కలసి తెరకెక్కించారు. మెయిన్ రోల్స్‌లో గేటెన్ మటరాజో, సీన్ గియాంబ్రోన్ నటించారు. వీళ్ళకి తోడుగా సారా షెర్మాన్, లులు విల్సన్ వంటి నటులు కూడా నటించారు. ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్‌లో డస్టిన్ పాత్రతో పాపులర్ అయిన గేటెన్, ఈ సినిమాతో సోలో లీడ్ హీరోగా తన సత్తా చాటాడు. ఈ హీరో ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు. ఈ చిత్రం 2026 ఏప్రిల్ 3న నేరుగా Hulu ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

జాక్, మోంట్‌గో అనే ఇద్దరు కాలేజీ కుర్రాళ్లు ఉంటారు. ఒక రోజు రాత్రి హాస్టల్ రూమ్‌లో కూర్చుని బోర్ కొడుతుందని, ఒక కొత్త రకం డ్రగ్ ను తీసుకుంటారు. అయితే అది వేసుకున్నాక పిజ్జా తింటే మజా ఇంకా బాగుంటుంది. అందుకే ఆ మత్తులో ఉన్నప్పుడే ఆకలేసి ఒక పిజ్జా ఆర్డర్ ఇస్తారు. ఆ పిజ్జా డెలివరీ వాడు కింద గేటు దగ్గరికి వస్తాడు. వీళ్లు ఉన్నది రెండో అంతస్తులో, ఆ పిజ్జా తెచ్చుకోవడానికి కిందకి వెళ్లడమే ఇప్పుడు వీళ్ల ముందున్న అతిపెద్ద టాస్క్. కానీ ఆ డ్రగ్ పవర్‌తో వీళ్లకు చుట్టుపక్కల అంతా వింత వింతగా కనిపిస్తూ ఉంటుంది. కిందికి వెళ్లే దారిలో లిఫ్ట్ ఆగిపోవడం, ఒక పిచ్చోడిలాంటి కాలేజీ వార్డెన్ అడ్డుపడటం, చివరికి ఒక సీతాకోకచిలుక కూడా వీళ్లను చంపడానికి వస్తున్నట్లు భయంకరమైన హాలూసినేషన్స్ కలుగుతాయి. కేవలం రెండు ఫ్లోర్లు దిగడానికి వీళ్లు పడే పాట్లు, ఆ మత్తులో వీళ్లు చేసే వెర్రి పనులు మామూలుగా ఉండవు. చివరికి వీళ్ళు ఆ పిజ్జా డెలివరీ కుర్రాడిని కలిశారా లేదా? ఆ వింత మత్తు దిగిందా లేదా? అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. మొత్తం మీద ఇది ఒక ఫుల్ లెంగ్త్ స్టోనర్ కామెడీ. పిజ్జా కోసం వీళ్లు చేసే ఈ వింత ప్రయాణం చూస్తే కడుపుబ్బ నవ్వొస్తుంది.

Read Also : తండ్రి పరువు కోసం కొడుకు వేట… కోర్టులో మొదలయ్యే అసలైన ఆట… ఐయండిబిలో అదిరిపోయే రేటింగ్

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×