// // Hoichoi 2026 lineup : హోయిచోయ్ ఓటీటీ 2026 లైనప్ -->
E-Paper
Advertisement

Hoichoi 2026 lineup : ‘క్వీన్స్’ నుంచి ‘కాలరాత్రి 2’ వరకు… క్రేజీ సిరీస్ లతో హోయిచోయ్ ఓటీటీ 2026 లైనప్

Hoichoi 2026 lineup : ‘క్వీన్స్’ నుంచి ‘కాలరాత్రి 2’ వరకు… క్రేజీ సిరీస్ లతో హోయిచోయ్ ఓటీటీ 2026 లైనప్
Advertisement

Hoichoi 2026 lineup : ఓటీటీలలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ ఎంత పాపులర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఈ లిస్ట్ లో హోయిచోయ్ అనే ఓటీటీ కూడా ఉంది. ఈ బెంగాలీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 2026లో 12 వెబ్ షోల ప్రతిష్టాత్మక స్లేట్‌ ను విడుదల చేసింది. ఈ లైనప్ లో పాపులర్ ఫ్రాంచైజీల సీక్వెల్స్ తో పాటు కొత్త ఒరిజినల్ కథలు కూడా రాబోతున్నాయి, థ్రిల్లర్లు, సోషల్ డ్రామాలు, జానపద కథలు, ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు వంటి వివిధ జానర్ల కు సంబంధించిన వెబ్ సిరీస్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి. హోయిచోయ్‌లో ఫిబ్రవరి నుండి మార్చి వరకు ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్ లు విడుదల కానున్నాయి.

క్వీన్స్

నిర్ఝర్ మిత్రా దర్శకత్వంలో మిమి చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ ‘క్వీన్స్’. ఈ రివేంజ్ డ్రామాలో వివాహం జరిగిన రోజే సర్కార్ కుటుంబంలో ఓ ఊహించని మరణం సంభవిస్తుంది. ప్రమాదంగా గుర్తించబడిన ఈ మరణం, నలుగురు వితంతువులను ఇబ్బందుల్లో పడేస్తుంది. దుఃఖం కోపంగా మారి, వారు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు.

అదాలత్ ఓ ఏక్టి మేయే

Advertisement

కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వంలో కౌషాని ముఖర్జీ నటించిన ఈ థ్రిల్లర్, కార్పొరేట్ ప్రపంచంలో ద్రోహం, న్యాయం గురించిన స్టోరీతో ఉంటుంది. విజయవంతమైన కార్పొరేట్ నాయకురాలు పనిలో ఊహించని ద్రోహానికి గురవుతుంది, దీంతో ఆమె ప్రపంచం తలక్రిందులవుతుంది. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు ఆమె పోరాటాన్ని ప్రమాదకరమైన అధికార క్రీడగా మారుస్తాయి. కౌషాని ముఖర్జీ నటన ఈ సిరీస్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

Also Read : ఎట్టకేలకు డైరెక్ట్ గా ఓటీటీలోకి అవార్డు విన్నింగ్ మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

గోయెండా ఆదిత్య మజుందార్

Advertisement

అరిత్ర సేన్ దర్శకత్వంలో పరంబ్రత చటోపాధ్యాయ నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్, రహస్యాలు, మోసాలు చుట్టూ తిరుగుతుంది. చౌదరి భవనంలో జరిగిన రహస్యమైన లిఫ్ట్ ప్రమాదం ఇన్వెస్టిగేటర్ ఆదిత్య మజుందార్‌ను ఆకర్షిస్తుంది. మర్డర్, మిస్సింగ్ వంటి అంశాలతో, ఊహించని ట్విస్ట్ లతో ఈ సిరీస్ సాగుతుంది. డిటెక్టివ్ పాత్రలో ఆకట్టుకుంటాడు. సస్పెన్స్, ట్విస్ట్‌లతో నిండిన ఈ సిరీస్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.

రోక్టోఫోలోక్

పరంబ్రత ఛటోపాధ్యాయ దర్శకత్వంలో శాశ్వత ఛటర్జీ నటించిన ఈ సూపర్‌నాచురల్ థ్రిల్లర్, పురాతన శాపాలు, పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతోంది. పవిత్ర కళాఖండం పోయిన తర్వాత పురాతన శాపం తిరిగి మేలుకొంటుంది. ఆధునిక కాలంలో ఆ శాపం భయాన్ని సృష్టిస్తుంది. అగంబాగిష్ చరిత్ర పునరావృతం కావడానికి ముందే చెడును ఆపాలి. శాశ్వత ఛటర్జీ నటన, హారర్ ఎలిమెంట్స్ ఈ సిరీస్‌ను ప్రత్యేకం చేస్తాయి.

కుహేలి

అదితి రాయ్ దర్శకత్వంలో రిధిమా ఘోష్, సుస్మితా డే, అంగనా రాయ్ నటించిన ఈ డ్రామా ఒక మర్డర్ మిస్టరీ. ప్రముఖ ACP దిగ్భ్రాంతికర మరణం కుహేలిని కుదిపేస్తుంది. దర్యాప్తు లోతుగా సాగుతున్నప్పుడు, షాకింగ్ విషయాలు బయట పడతాయి. ఇక ఇంకా ఈ లిస్ట్ లో ఠాకుమార్ ఝులి, బిరంగన 2, ఏకేన్ బాబు – పురూలియా-ఎ-పక్రావ్, మోంటు పైలట్ 3, నికోష్ ఛాయా 2, కాలరాత్రి 2 వంటి సిరీస్ లు ఉన్నాయి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×