E-Paper
Advertisement

OTT Movie : ఫ్లైట్ లో హైజాకర్లకు చుక్కలు చూపించే పైలట్… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు

OTT Movie : ఫ్లైట్ లో హైజాకర్లకు చుక్కలు చూపించే పైలట్… క్లైమాక్స్ చూస్తే కన్నీళ్ళు ఆగవు
Advertisement

OTT Movie : దక్షిణ కొరియా ఆకాశంలో ఉన్న ఒక సాధారణ విమానంలో ఒక్కసారిగా భీకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒక యువకుడు హ్యాండ్ గ్రెనేడ్‌తో బెదిరించి, విమానాన్ని ఉత్తర కొరియాకు తీసుకెళ్లమని డిమాండ్ చేస్తాడు. అందులోని 50 మంది ప్రయాణీకుల ప్రాణాలను కాపాడే బాధ్యతను ఫైటర్ అయిన కెప్టెన్ తీసుకుంటాడు. ఇంతకీ ఆ విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారు ? అందులోని వాళ్ళంతా ప్రాణాలతో బయట పడ్డారా ? ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం.

స్టోరీలోకి వెళితే

Advertisement

1971లో జరిగిన కొరియన్ ఎయిర్‌లైన్స్ F27 విమాన హైజాక్ ప్రయత్నం ఆధారంగా, నిజ జీవిత సంఘటనల నుండి ఈ సినిమా స్ఫూర్తి పొందింది. కథ 1969లో ప్రారంభమవుతుంది. దక్షిణ కొరియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ గా టే-ఇన్ ఉద్యోగంలో చేరుతాడు. తన గురువు అయిన యంగ్-సూక్ నడుపుతున్న విమానం హైజాక్ అవుతుంది. ఈ విమానాన్ని పేల్చివేయాలని ఇతనికి ఆదేశాలు వస్తాయి.ప్రయాణీకుల భద్రత కోసం ఆదేశాలను పాటించనందుకు టే-ఇన్ ఎయిర్ ఫోర్స్ నుండి తొలగించబడతాడు. ఆతరువాత జరిగే ఒక హైజాక్ ఇతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది.

1971లో టే-ఇన్ కొరియన్ ఎయిర్‌లైన్స్‌లో కో-పైలట్‌గా చేరతాడు. కెప్టెన్ గ్యూ-సిక్ ఆధ్వర్యంలో సోక్చో నుండి సియోల్‌కు వెళ్ళే ఫ్లైట్ KAL-366లో పనిచేస్తాడు. 50 మంది ప్రయాణీకులతో. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, యంగ్-డే అనే 21 ఏళ్ల యువకుడు, హ్యాండ్ గ్రెనేడ్‌తో బెదిరించి, విమానాన్ని ఉత్తర కొరియాకు తీసుకెళ్లమని డిమాండ్ చేస్తాడు. యంగ్-డే హైజాక్ ప్రయత్నం వెనుక ఒక విషాద కథ ఉంది. అతని కుటుంబం దక్షిణ కొరియా సైనిక పాలనలో ఉత్తర కొరియన్ సానుభూతిపరులుగా తప్పుగా ఆరోపించబడి హింసించబడ్డారు. ఇది అతనిని ద్వేషంతో నింపి, ఉత్తర కొరియాకు తప్పించుకోవాలనే నిర్ణయానికి దారితీస్తుంది.

Advertisement

హైజాక్ సమయంలో గ్రెనేడ్ పేలుడు కారణంగా కెప్టెన్ గ్యూ-సిక్ గాయపడతాడు. టే-ఇన్ విమాన నియంత్రణను తీసుకోవలసి వస్తుంది. టే-ఇన్, తన గతంలోని వైఫల్యం బాధతో, ప్రయాణీకులను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో దక్షిణ కొరియన్ అధికారుల నుండి వచ్చే ఒత్తిడిని కూడా ఎదుర్కొంటాడు. అధికారులు విమానాన్ని ఉత్తర కొరియా సరిహద్దు దాటనీయకుండా చేయాలని ఆదేశిస్తారు. చివరికి టే-ఇన్ ఆ విమానాన్ని హైజాక్ అవ్వకుండా చూస్తాడా ? అందులోని ప్రయాణికులను కాపాడతాడా ?అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మూడేండ్ల తరువాత తెలుగులో మలయాళ మర్డర్ మిస్టరీ… ట్విస్టులతో మెంటలెక్కిపోతుంది

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు హైజాక్ 1971 (Hijack 1971). 2024 లో వచ్చిన ఈ సినిమాకి కిమ్ సంగ్-హాన్ దర్శకత్వం వహించారు. ఇందులో హా జంగ్-వూ (టే-ఇన్), యెయో జిన్-గూ (యంగ్-డే), సంగ్ డాంగ్-ఇల్ (గ్యూ-సిక్), చే జంగ్-సియోక్ (ఓక్-సూన్) వంటి నటులు నటించారు. 1 గంట 40 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDb లో 7.1/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×