// // Hey Balawanth movie OTT : థియేటర్లలో విడుదలకు ముందే -->
E-Paper
Advertisement

Hey Balawanth movie OTT : థియేటర్లలో విడుదలకు ముందే సుహాస్ మూవీకి ఓటీటీ డీల్… స్ట్రీమింగ్ కూడా అప్పుడే

Hey Balawanth movie OTT : థియేటర్లలో విడుదలకు ముందే సుహాస్ మూవీకి ఓటీటీ డీల్… స్ట్రీమింగ్ కూడా అప్పుడే
Advertisement

Hey Balawanth movie OTT : సుహాస్, శివాని నగరం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తర్వాత ‘హే బలవంత్’ అనే కొత్త కామెడీ చిత్రంతో తిరిగి వస్తున్నారు. ఈ చిత్రానికి మొదట ‘హే భగవాన్’ అని పేరు పెట్టారు, కానీ సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత దానిని హే బలవంత్ గా మార్చారు. ఈ కామెడీ డ్రామాలో VK నరేష్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులలో బలమైన బజ్ పెంచడానికి మేకర్స్ ఈ సినిమాను చురుగ్గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాక ముందే ఓటీటీ, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ గా ఎక్కడ ప్రీమియం కాబోతోందో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘హే బలవంత్’ చిత్రానికి గోపి అచ్చర దర్శకత్వం వహించగా, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ రెండవ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి షణ్ముక ప్రశాంత్ కథను రాశారు. నెల్లూరు సుధాకర్, అన్నపూర్ణ, హర్ష వర్ధన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడిగా ఈ సినిమాకు పని చేశారు. ఈ చిత్రం థియేటర్లలో 2026 ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను Z5 సొంతం చేసుకోగా , Z తెలుగు ఛానల్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నాయి. ఈ హక్కుల నుండి మేకర్స్ మంచి మొత్తాన్ని పొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మార్చి 2026 రెండవ వారంలో డిజిటల్ గా ప్రసారం కానుంది.

సెన్సార్ వివరాలు

Advertisement

సుహాస్ చిత్రానికి సెన్సార్ A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కనీసం U/A సర్టిఫికేట్ అయినా ఆశించామని నిర్మాతలు నిరాశ చెందారని తెలుస్తోంది. సినిమాలో తండ్రి చేసే వ్యాపారం కారణంగా ఈ రేటింగ్ వచ్చిందని తెలుస్తోంది. రెండు గంటల పద్నాలుగు నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా నడవనుంది.

కథ

సాధారణంగా సుహాస్ సినిమాలు సామాన్యుల సమస్యలను ఆసక్తిగా చూపిస్తాయి. ఈ సినిమాలో కూడా ఒక సామాన్య యువకుడు అనుకోకుండా ఎదుర్కొనే వింత పరిస్థితులు, వాటి నుండి తలెత్తే కామెడీ చుట్టూ కథ నడుస్తుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనే యువకుడి కథ ఆధారంగా ఈ స్టోరీ ఉంటుంది. అయితే విధి మరోలా అతని జీవితంతో ఆడుకుంటుంది. అతను తన తండ్రి వ్యాపారంలో చేరవలసి వస్తుంది. అయితే ఆ వ్యాపారం బయటకి చెప్పుకోలేనిది ఉంటుంది. ఇంతలో ఆ వ్యాపారం హీరో ప్రేమకు కూడా సమస్యగా మారుతుంది. అసలు ఈ వ్యాపారం ఏమిటి? హీరో ప్రేమకథను ఇది ఎలా అడ్డుకుంటుంది? ఈ పరిస్థితిని హీరో ఎలా ఎదుర్కొంటాడు? అనే ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Advertisement

Read Also : ఒళ్లు గగుర్పొడిచే నిజాలతో బెంగాలీ థ్రిల్లర్ సిరీస్… రిలీజ్ డేట్ వాయిదా… అందుబాటులోకి వచ్చేది అప్పుడే

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×