E-Paper
Advertisement

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?
Advertisement

Jatadhara OTT: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం జటాధర.. ‘రాక్షస కావ్యం’ అనే సినిమాకి ఎడిటర్ గా పనిచేసిన వెంకట్ కళ్యాణ్ ఈ మూవీకి డైరెక్టర్.. ఇదే అతని మొదటి సినిమా. హీరో సుధీర్ బాబు కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు. కాస్త గ్యాప్ తీసుకున్న ఈ హీరో ఈ మూవీతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలని ధీమాతో థియేటర్లోకి వచ్చేసాడు.. ఇవాళ భారీ అంచనాలతో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ మూవీ పై జనాలు కాస్త ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.. రివ్యూలు పాజిటివ్ గా రావడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.. సుధీర్ బాబు ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది.. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకుంది. ఏ ఫ్లాట్ ఫామ్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

‘జటాధర’ ఓటీటీ ఫిక్స్..?

కొత్తగా వచ్చే సినిమాలు ఆల్రెడీ ఓటీటీ రైట్స్ ని ఫిక్స్ చేసుకొని థియేటర్లలోకి వచ్చేస్తుంటాయి. అయితే సినిమా టాక్ ను బట్టి విడుదల తేదీ మారుతుంది తప్ప ఫ్లాట్ఫామ్ మారదు.. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ముందుగానే డేట్ ని కూడా లాక్ చేసుకుని వస్తున్నాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన సుధీర్ బాబు మూవీ జటాధర కూడా భారీ ధరకు డిజిటల్ హక్కులను పూర్తి చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఫైనల్ గా ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి.. డిఫరెంట్ స్టోరీ కావడంతో సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొనసాగితే ఈ మూవీ హిట్ అవడం ఖాయం.. చూడాలి మరి సుధీర్ బాబు అకౌంట్లో ఈ సినిమా హిట్ అవుతుందో.. ఫట్ అవుతుందో..

Advertisement

Also Read :‘జటాధర’ట్విట్టర్ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఇది ఒక హారర్ కామెడీ చిత్రం.. ధన పిశాచి తిష్ట వేసిన ఓ ఇంట్లోకి భార్య భర్తలు కాపురానికి వస్తారు. అయితే ధనంపై మొహం కలిగిన ఆ భార్యని ధన పిశాచి లొంగదీసుకోవడం. అందుకోసం బలికోరడం.. అందుకోసం ఓ చిన్న పిల్లాడిని బలికి సిద్ధం చేయడం. మరోపక్క కుటుంబ సభ్యులకు తెలియకుండా హీరో ఆ దెయ్యాన్ని పట్టుకొని ప్రయత్నం చేస్తాడు. హీరో ఆ దెయ్యాన్ని పట్టుకున్నాడా? ఆ దయమే అతన్ని ఆవహిస్తుందా..? క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పాలి… మొత్తానికి ఈ స్టోరీ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, ధన పిశాచి గా, విలన్ క్యారక్టర్ లో కనిపించబోతోంది. అదే విధంగా శిల్పా శిరో్ద్కర్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించింది.. ఇవాళ రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా రిలీజ్ కావడంతో ఈ సినిమాకు పోటీ తప్పేలా లేదు.. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి…

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×