E-Paper
Advertisement

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్
Advertisement

OTT Movie : థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేని కొన్ని సినిమాలు, ఓటీటీలో టాప్ లేపుతుంటాయి. అలాంటి సినిమా గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ తెలుగు సినిమా డబుల్ మర్డర్ కేసును సాల్వ్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. కథలో టైట్ ఇన్వెస్టిగేషన్ హైలైట్ గా ఉంటుంది. ఈ సినిమా ఓటీటీలో రెండు నెలల పాటు స్ట్రీమింగ్ చార్ట్స్‌లో టాప్‌లో ఉండి ఓటీటీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

‘హెర్: చాప్టర్ 1’ 2023లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. శ్రీధర్ స్వరాఘవ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రుహానీ శర్మ ప్రధాన పాత్రలో నటించింది. వికాస్ వశిష్ట, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. డబుల్ అప్ మీడియా బ్యానర్‌పై రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించిన ఈ సినిమా, థియేటర్లలో 2023 జూలై 21న విడుదలై, ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. 1 గంట 43 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అర్చనా ప్రసాద్ తెలంగాణ స్టేట్ పోలీస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్. ఆరు నెలల సస్పెన్షన్ తర్వాత డ్యూటీలోకి తిరిగి వస్తుంది. హైదరాబాద్ శివార్లలో విశాల్ పసుపులేటి, స్వాతి అనే ఇద్దరి డబుల్ మర్డర్ కేసును ఆమెకు అప్పగిస్తారు. ఈ కేసులో చనిపోయిన అమ్మాయిపై అఘాయిత్యం కూడా చేసినట్లు అనుమానాలు ఉంటాయి. ఈ కేసు ఒక సంచలనంగా మారుతుంది. అర్చనా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. విశాల్, స్వాతి వివాహేతర సంబంధంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఉపయోగించిన ఆయుధం అర్చనా గతంతో ముడిపడి ఉంటుంది. ఇది ఆమెకు వ్యక్తిగతంగా కూడా కనెక్ట్ అవుతుంది.

ఆమె గతంలో తన బాయ్‌ఫ్రెండ్ శేష్‌ని ఒక షూటౌట్‌లో కోల్పోయిన సంఘటన ఈ కేసుతో లింక్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతుండగా, కేశవ్ అనే టెర్రరిస్ట్, ఆయుధాల సప్లయర్‌తో కనెక్షన్ బయటపడుతుంది. అర్చనా ఈ కేసును సాల్వ్ చేయడంతో పాటు, NIAలో చేరాలనే తన కలను సాధించాలని పట్టుదలతో ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు కథ ఆసక్తికరంగా సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఊహించని ట్విస్టులు వస్తాయి. క్లైమాక్స్‌లో రెండు కేసులు లింక్ అవుతాయి. సీక్వెల్‌కి ఓపెనింగ్ ఇస్తూ కథ ముగుస్తుంది. అర్చనా ఈ కేసులో హంతకులను పట్టుకుంటుందా ? ఆమె గతానికి, ఈ హత్యలకు లింక్ ఏమిటి ? డబుల్ మర్డర్స్ ఎందుకు జరిగాయి ? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×