E-Paper
Advertisement

Heist Thriller OTT : 7 రోజుల్లో 440 కోట్లను కొల్లగొట్టే కథ… ఆండ్రియాను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు భయ్యా

Heist Thriller OTT : 7 రోజుల్లో 440 కోట్లను కొల్లగొట్టే కథ… ఆండ్రియాను ఇలాంటి పాత్రలో అస్సలు ఊహించలేరు భయ్యా
Advertisement

Heist Thriller OTT : హీస్ట్ థ్రిల్లర్ సినిమాలు అనగానే హాలీవుడ్ మూవీస్ గుర్తొస్తాయి. ముఖ్యంగా ‘మనీ హీస్ట్’. మరి ఆ సిరీస్ ప్రేక్షకులపై క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. కానీ ఈరోజు మన మూవీ సజెషన్ అది కాదు. రీసెంట్ గా థియేటర్లలో సందడి చేసిన మరో మూవీ. ఆ సినిమా పేరేంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

కవిన్, ఆండ్రియా జెరెమియా హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ ‘మాస్క్’ (Mask). వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహించిన ఈ తమిళ మూవీ రీసెంట్ గానే థియేటర్లలోకి వచ్చింది. డైరెక్టర్ గా ఆయనకు ఇదే మొదటి మూవీ. ఇందులో రుహాని శర్మ, చార్లే, ఆడుకలమ్ నరేన్, సుబ్రమణ్యం శివ, కల్లూరి వినోద్, మున్నార్ రమేష్, బాల శరవణన్, అర్చన చందోక్, జార్జ్ మేరియన్, పవన్, వెంకట్ సెంగుట్టువన్, మహదేవ్ పయ్యక్కల్ కీలక పాత్రలు పోషించారు. రెడిన్ కింగ్స్లీ అతిధి పాత్రలో మెరిశాడు. ఈ హీస్ట్ థ్రిల్లర్‌లో కవిన్ డబ్బు మీద ఆసక్తి ఉన్న డిటెక్టివ్ వేలుగా నటించగా, ఆండ్రియా అవినీతిపరురాలైన NGO నాయకురాలిగా కన్పిస్తుంది. ఆండ్రియా ఫస్ట్ టైమ్ లో ఇందులో విలన్ గా కన్పించింది. అయితే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. ఒకవేళ థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయితే, ఇప్పుడు ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని ఈ సినిమాను చూడవచ్చు. జీ5 (ZEE5)లో ‘మాస్క్’ స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి థియేటర్లలో డిజాస్టర్ అన్పించుకున్న ఎన్నో సినిమాలు ఓటీటీలో దుమ్మురేపాయి. ఈ సినిమా అలాంటిది కాకపోయినా వన్ టైమ్ వాచ్ కి సరిపోతుంది. కాబట్టి కొత్తగా ఏదైనా హీస్ట్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఓసారి లుక్కేయండి.

Advertisement

Read Also : మరికొన్ని గంటల్లో ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2’ స్ట్రీమింగ్… ఎక్కడ చూడొచ్చంటే ?

స్టోరీలోకి వెళ్తే…

డిటెక్టివ్ వేలు డబ్బు కోసం కక్కుర్తి పడతాడు. మరో రకంగా చెప్పాలంటే అత్యాశ. మరోవైపు NGO పేరుతో అక్రమాలు చేస్తుంది భూమి (ఆండ్రియా జెర్మియా). అవినీతిపరుడైన ఒక పొలిటికల్ లీడర్ తన బ్లాక్ మనీని భూమికి అప్పగిస్తాడు. దాన్ని జాగ్రత్తగా దాచమని ఆమెకు చెప్తాడు. కానీ మాస్క్ ధరించిన ఒక ముఠా కారణంగా భూమి చేతుల్లో నుంచి ఆ డబ్బు చేజారుతుంది. అంటే ఆ డబ్బును దొంగిలిస్తారు. ఇప్పుడే హీరో రంగంలోకి దిగుతాడు. భూమి ఆ డబ్బును, ఈ పని చేసిన వాడిని కనిపెట్టడానికి డిటెక్టివ్ వేలుని తీసుకొస్తుంది. ఇక వేలు తన తెలివి తేటలు ఉపయోగించి ఆ డబ్బును వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఇంతకీ వేలు ఆ డబ్బును తిరిగి తీసుకురాగలిగాడా ? అసలు కొట్టేసింది ఎవరు ? చివరికి ఏమైంది ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని తెరపై చూడాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×