E-Paper
Advertisement

ఇద్దరబ్బాయిలతో ఒకే అమ్మాయి… ఈ చైనీస్ సిరీస్ తో సాటిస్ఫ్యాక్షన్ గ్యారంటీ

ఇద్దరబ్బాయిలతో ఒకే అమ్మాయి… ఈ చైనీస్ సిరీస్ తో సాటిస్ఫ్యాక్షన్ గ్యారంటీ
Advertisement

Romantic Series : యవ్వనం మధురమైన జ్ఞాపకాలు, నిజమైన స్నేహాలు, మొదటి ప్రేమలు, ఛాలెంజ్ లతో నిండి ఉంటుంది. ఈ అనుభవాలన్నీ అందంగా చెప్పిన హార్ట్ టచింగ్ చైనీస్ సిరీస్ ‘ఆల్వేస్ హోమ్’ (Always Home 2025 Chinese series). ప్రముఖ రచయిత్రి షియావో గే రాసిన పాపులర్ నవల ‘Under the Tree, There’s a Red House’ ఆధారంగా 30 ఎపిసోడ్‌లతో తీసిన ఈ సిరీస్‌ లో జాయ్ షియావోవెన్, డానియల్ జౌ, యాంగ్ క్సిజీ ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

2007లో 16 ఏళ్ల చెన్ హువాన్ ఎర్ చిన్న పట్టణం నుంచి తల్లితో కలిసి తియాన్ హే అనే సిటీకి వస్తుంది. ఆమె తల్లి స్థానిక ఆసుపత్రిలో ఉద్యోగం మారడం వల్ల, ఆసుపత్రి సిబ్బంది నివసించే ఒక అందమైన రెసిడెన్షియల్ కాంపౌండ్‌లో వారు సెటిల్ అవుతారు. కొత్త ప్రదేశం, కొత్త పాఠశాల, కొత్త వాతావరణం – హువాన్ ఎర్‌కి ప్రతిదీ కొత్తగా ఉంటుంది. అయితే ఆ కాంపౌండ్‌లోనే ఆమె జీవితం మారిపోయే సంఘటనలు జరుగుతాయి. పొరుగు ఇంట్లో ఉండే ఇద్దరు అబ్బాయిలతో ఆమె స్నేహం ఏర్పడుతుంది. జింగ్ క్సిచి అల్లరి స్వభావం, ఎప్పుడూ నవ్వులు, ఫుట్‌బాల్ పట్ల మక్కువ ఉన్న ఎనర్జీటిక్ వ్యక్తి. చదువులో పెద్దగా ఆసక్తి చూపనప్పటికీ, మంచి మనిషి. స్నేహితుల కోసం ఏమైనా చేసే స్వభావం ఉంటుంది.

Advertisement

ఇక సాంగ్ కాంగ్ శాంత స్వభావం, అత్యంత తెలివైన టాప్ స్టూడెంట్. బాధ్యతగా ఉంటూ, ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ ముగ్గురూ హైస్కూల్ రోజుల నుంచి ఒకరికొకరు మంచి బంధం ఏర్పరుచుకుంటారు. కలిసి చదువుకోవడం, వారాంతాల్లో విహారాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్, రాత్రి పుస్తకాలు చదవడం, ఒకరి ఇంట్లో ఒకరు సమయం గడపడం… యవ్వనంలోని అన్ని మధుర క్షణాలు వీరి జీవితంలో నిండి ఉంటాయి. కథ క్రమంగా ముందుకు సాగుతూ, వారు హైస్కూల్ నుంచి యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్, మొదటి ఉద్యోగాలు, కెరీర్ సవాళ్లు వరకు ప్రయాణం చేస్తారు.

స్నేహం నుంచి మొదలైన ఆకర్షణలు, సీక్రెట్ క్రష్‌లు, ఒకే గ్రూప్‌లో ఏర్పడే లవ్ ట్రయాంగిల్‌లు, వాటి వల్ల వచ్చే మనస్పర్థలు చాలా సహజంగా చిత్రీకరించారు. తల్లిదండ్రుల ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, విడాకులు లేదా కుటుంబంలో ఏర్పడే మార్పులు పిల్లల జీవితాలపై చూపే ప్రభావం, యవ్వనంలో ఎదురయ్యే నిజమైన బాధలన్నీ సహజంగా చూపించారు. ఈ సిరీస్ ముగిసేసరికి అమాయకమైన టీనేజ్‌ నుంచి బాధ్యతాయుతమైన, పరిణితి చెందిన యువకులుగా వారు ఎలా మారారో హార్ట్ టచింగ్ గా చూడవచ్చు. ‘హోమ్’ అంటే కేవలం ఇల్లు కాదు… మనం ఆశ్రయం పొందే వ్యక్తులు, జ్ఞాపకాలు, బంధాలు అని అందంగా చెప్పే సిరీస్ ఇది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : పూర్వీకుల ఇంట్లో చిన్నారిని వెంటాడే పురాతన శాపం… మలయాళం ఫాంటసీ హారర్ థ్రిల్లర్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×