E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయిని వేటాడే ముసుగు మనిషి… ఈ సైకో కిల్లర్ క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్

OTT Movie : అమ్మాయిని వేటాడే ముసుగు మనిషి… ఈ సైకో కిల్లర్ క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్
Advertisement

OTT Movie : డిఫెరెంట్ స్టోరీలతో సినిమాలను తెరకెక్కిస్తునే ఉన్నారు మేకర్స్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక సైకో కిల్లర్ చుట్టూ  తిరుగుతుంది. ప్రేమికులను చంపడమే కిల్లర్ లక్ష్యం గా పెట్టుకుంటాడు. . ఒంటరిగా ఏ ప్రేమికుల జంట దొరికినా అంతే సంగతులు. వాళ్ళకి పైలోకానికి టిక్కెట్ దొరికినట్టే. ఓటీటీలో ఇటువంటి సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఈ కామెడీ స్లాషర్  మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

వాలెంటైన్స్ డే సమయంలో సీటెల్ నగరంలో వరుసహత్యలు జరరుగుతుంటాయి. ‘హార్ట్ ఐస్’ అనే అనే సీరియల్ కిల్లర్ ప్రేమలో ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకొని, వారిని దారుణంగా చంపుతుంటాడు. ఈ క్రమంలో అలీ, జే ఇద్దరూ సహోద్యోగులుగా ఉంటారు. వీరు ఒక పని సందర్భంగా కలిసి ఉన్నప్పుడు, ‘హార్ట్ ఐస్’ కిల్లర్ వీరిని ప్రేమ జంటగా తప్పుగా భావించి చంపడానికి వెంబడిస్తాడు. ఈ పరిస్థితిలో, అలీ, జే తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడుతారు. ఈ సమయంలో వారి మధ్య ఉన్న సంబంధం కూడా ఒక రొమాంటిక్ బంధంగా మారుతుంది. ఈ మోవి భయానక సన్నివేశాలతో పాటు హాస్యం, రొమాన్స్‌ను కలగలిపి, వినోదాత్మక అనుభవాన్ని అందిస్తుంది. కిల్లర్‌ను ఎదుర్కోవడం, అతను ఎవరో కనిపెట్టడం లాంటి సన్నివేశాలు ఉత్కంఠ భరిత మలుపులు తీసుకుంటాయి. చివరికి ఆ కిల్లర్ ని వీళ్ళు పట్టుకుంటారా ?కిల్లర్ చేతిలో బలైపోతారా ? వాలెంటైన్స్ డే రోజే కిల్లర్ హత్యలు ఎందుకు చేస్తున్నాడు ?  చివరికి ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ?  అనే ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ కామెడీ స్లాషర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : అమ్మాయిల పిచ్చితో దిక్కుమాలిన పని… ఈ మలయాళ సైకో థ్రిల్లర్ క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ భయ్యా

Advertisement

 

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ రొమాంటిక్ కామెడీ స్లాషర్ మూవీ పేరు ‘హార్ట్ ఐస్’ (Heart Eyes). 2025 లో వచ్చిన ఈ మూవీకి జోష్ రూబెన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఫిలిప్ మర్ఫీ, క్రిస్టోఫర్ లాండన్, మైఖేల్ కెన్నెడీ వంటి నటులు నటించారు. రిపబ్లిక్ పిక్చర్స్ ద్వారా ఫిబ్రవరి 7, 2025న థియేటర్‌లలో విడుదలైంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ‘హార్ట్ ఐస్’ రొమాంటిక్, కామెడీ, స్లాషర్ హారర్ జోనర్‌ లలో తెరకెక్కింది. ఈ మూవీ ఇంగ్లీష్‌లో విడుదలైనప్పటికీ, తెలుగు సబ్‌ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×