E-Paper
Advertisement

Haq courtroom drama OTT : ఇండియాలోనే అత్యంత వివాదాస్పద అంశంతో తెరకెక్కిన మూవీ… ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే ?

Haq courtroom drama OTT : ఇండియాలోనే అత్యంత వివాదాస్పద అంశంతో తెరకెక్కిన మూవీ… ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే ?
Advertisement

Haq courtroom drama OTT : ఓటీటీలలో కోర్టు రూమ్ డ్రామాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. లాయర్ల వాదన, ఒకరి ఎత్తులను మరొకరు తిప్పి కొట్టడం వంటి సీన్స్ హైలెట్ గా ఉంటాయి. అందులోనూ సెక్షన్లు వాడుతూ చేసే వాదనలు మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. మరోవైపు రియల్ స్టోరీలకు కూడా మంచి ఆదరణ దక్కుతుంది. మరి ఈ రెండూ కలిస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఓ పాపులర్ కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమా ఓటీటీలోకి రాబోతోంది. మరి ఆ మూవీ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

యామి గౌతమ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ కోర్టు రూమ్ డ్రామా ‘హక్’ (Haq). థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, భారతదేశ న్యాయ చరిత్రలోని ఒక మైలురాయిగా మారిన ఓ మహిళ పోరాటం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రం మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నుండి ప్రేరణ పొందింది. ఈ కేసు 1980లలో నిర్వహణ హక్కులు, వ్యక్తిగత చట్టం, రాజ్యాంగ రక్షణలపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. 2025 నవంబర్ 7న సినిమా థియేటర్లలో విడుదలైన ‘హక్’ చిత్రంలో షీబా చద్దా కూడా కీలక పాత్రలో నటించారు. దీన్ని జంగ్లీ పిక్చర్స్, ఇన్‌సోమ్నియా ఫిల్మ్స్, బవేజా స్టూడియోస్ బ్యానర్లపై వినీత్ జైన్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా, హర్మాన్ బవేజా నిర్మించారు. థియేటర్లలో ఈ సినిమా చూడని ప్రేక్షకుల కోసం ఈ మూవీ ఇప్పుడు OTTలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. సమాచారం ప్రకారం ‘హక్’ 2026 జనవరి 2 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Read Also :  అబ్బాయిల్ని మోసం చేసిన చేసిన అమ్మాయిల్ని చంపే సైకో… ప్రభుదేవాను ఇలాంటి రోల్ లో అస్సలు ఊహించలేరు భయ్యా

కథలోకి వెళ్తే…

భర్త రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఓ మహిళ జీవితం అల్లకల్లోలం మారుతుంది. అలా మారిన బానో అనే మహిళ కథ ఇది. 1975లో షా బానోను ఆమె భర్త, న్యాయవాది మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చి, ఆమెను వదిలేశాడు. అందరు మహిళల్లాగా అత్తారింట్లో తనకు ఎదురైన కష్టాలను, అన్యాయాన్ని మౌనంగా భరించకుండా, న్యాయ పోరాటానికి సిద్ధం అవుతుంది ఆవిడ. షా బానో తన భర్త నుండి భరణం కోరుతూ CrPC సెక్షన్ 125 కింద కేసు దాఖలు చేశారు. మరి ఆ కేసు ఎలా సాగింది అన్నది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×