E-Paper
Advertisement

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి డిఫెరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీలను తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. అలాగే మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి డిఫరెంట్ స్టోరీ ఉన్న ఒక సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ప్రేమ, సీరియల్ కిల్లింగ్ థీమ్స్ తో నడుస్తుంది. రెండు పార్ట్స్ గా వస్తున్న ఈ సిరీస్ నెల రోజుల గ్యాప్ లో రెండూ స్ట్రీమింగ్ అవుతాయి. ఇక థ్రిల్లర్ ఫ్యాన్స్ బింజ్ వాచ్ కి సిద్ధంగా ఉండండి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? ఎప్పుడు వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘హాడ్ ఐ నాట్ సీన్ ది సన్ (Had I Not Seen the Sun) తైవానీస్ డార్క్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్. దీనిని చియాంగ్ చి-చెంగ్, చియెన్ చి-ఫెంగ్ రూపొందించారు. ఇందులో జెంగ్ జింగ్-హువా, మూన్ లీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ పార్ట్ 1 : 2025 నవంబర్ 13, పార్ట్ 2 : డిసెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Read Also : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

స్టోరీ ఏమిటంటే

25 ఏళ్ల లీ జెన్ అనే యువకుడు తన హైస్కూల్ క్లాస్‌మేట్స్‌ను చంపేసి, తనకు తానుగా పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అవుతాడు. అతను “రెయిన్‌స్టార్మ్ కిల్లర్” అనే పేరుతో ఈ హత్యలు చేశానని అంగీకరిస్తాడు. అయితే చంపిన వివరాలు చెబుతాడు కానీ ఎందుకు చంపాడో మాత్రం చెప్పడు. ఇదే సమయంలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ జౌ పిన్, అతన్ని జైల్లో ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక్కడి నుంచి మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ తర్వాత జౌకి వింత కలలు వస్తాయి. ఒక చనిపోయిన స్టూడెంట్ ఆత్మ కూడా ఆమెకు కనిపిస్తుంది. ఇప్పుడు లీ జెన్ పాస్ట్ లో కూడా హైస్కూల్ లవ్ స్టోరీ, హార్ట్ బ్రేక్ ఎమోషన్స్ బయటపడుతాయి. ఒక బ్యాలెట్ డాన్సర్ గర్ల్‌తో లవ్ స్టోరీ మిస్టరీగా నడిచిందని తెలుస్తుంది. చివర్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో ట్రూత్ రివీల్ అవుతుంది. లవ్ ఎలా డార్క్‌ నెస్‌కి దారి తీస్తుందో ఈ సిరీస్ చూపిస్తుంది. ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏమిటి ? లీ జెన్ అమ్మాయిలను చంపడానికి అసలు కారణం ఏమిటి ? ఫిల్మ్ మేకర్ జౌ పిన్ కి ఎందుకు ఘోస్ట్ కలలు వస్తున్నాయి ? ఈ సిరీస్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Advertisement

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×