E-Paper
Advertisement

OTT Movie : ప్రేమ పేరుతో సైకో పనులు… ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తూ… ఈ అరాచకం మామూలుగా లేదురా నాయనా

OTT Movie : ప్రేమ పేరుతో సైకో పనులు… ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తూ… ఈ అరాచకం మామూలుగా లేదురా నాయనా
Advertisement

OTT Movie : సైకోలు రకరకాలుగా ఉంటారు. కొంతమంది ప్రేమ పేరుతో వికృతంగా ప్రవర్తిస్తుంటారు. వీళ్ళు పక్కనే ఉండి గోతులు తీస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక అబ్బాయి తన కన్నా పెద్ద వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించి, ఆమె జీవితాన్ని హ్యాక్ చేస్తాడు. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తీసుకుటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే

స్టోరీలోకి వెళితే

Advertisement

సమీరా ఖన్నా అలియాస్ సామ్ ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్‌లో ఎడిటర్‌గా పనిచేస్తుంది. ఆమె జీవితం కొంత ఒడిదుడుకుల్లో ఉంటుంది. ఆమె తల్లి ఆసుపత్రిలో జీవన్మరణ సమస్యతో పోరాడుతోంది. మరో వైపు ఆమె సినీ నటుడు అయిన ఓం కపూర్ తో రిలేషన్ లో ఉంటుంది. సామ్ తో ఈ రిలేషన్ ని గుట్టుగా ఉంచడానికే చూస్తుంటాడు ఓం. తన భార్యకు విడాకులు ఇస్తానని ఆమెతో సంబంధం కొనసాగిస్తాడు. అయితే విడాకులు ఇవ్వకుండా సామ్ తో గడుపుతుంటాడు. ఈ క్రమంలో సామ్‌కు పొరుగున నివసించే 19 ఏళ్ల వివేక్ తివారీ అనే యువకుడు ఆమెపై ఫీలింగ్స్ ని పెంచుకుంటాడు. వివేక్ ఒక నైపుణ్యం గల హ్యాకర్. సామ్ పుట్టినరోజు పార్టీలో ఓం రాకపోవడంతో ఆమె నిరాశకు గురవుతుంది. ఈ సమయంలో వివేక్ ఆమెను ఓదార్చడం ద్వారా దగ్గరవుతాడు. వారిద్దరూ ఒక రాత్రి ఏకాంతంగా గడుపుతారు. అయితే తర్వాత సామ్ దీనిని తప్పుగా భావించి, వివేక్‌తో దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది.

అయితే సామ్ దూరంగా ఉండటాన్ని వివేక్ జీర్ణించుకోలేకపోతాడు. ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి తన హ్యాకింగ్ నైపుణ్యాలను ఉపయోగిస్తాడు. అతను ఆమె సోషల్ మీడియా ఖాతాలను, కంపెనీ ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేస్తాడు. దీని వల్ల సామ్ తన ఉద్యోగాన్ని కోల్పోతుంది. అంతే కాకుండా అతను సామ్, ఓం సన్నిహిత ఫోటోలను లీక్ చేస్తాడు. దీంతో ఓం ఆమెతో సంబంధాన్ని తెంచుకుంటాడు. ఇప్పుడు సామ్ జీవితం గందరగోళంలో పడుతుంది. సామ్ వివేక్‌పై పోలీసు ఫిర్యాదు చేస్తుంది, కానీ వివేక్ తన హ్యాకింగ్ నైపుణ్యాలతో పోలీసులను కూడా మోసం చేసి తప్పించుకుంటాడు. చివరగా, సామ్ తన పొరుగువాడైన రోహన్ సహాయంతో వివేక్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి సామ్, వివేక్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆమె ఎవరితో రిలేషన్ పెట్టుకుంటుంది ? సామ్ సమస్యలు తీరిపోతాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : జనాభాను తగ్గించడానికి ఇంటికొక మనిషిని ఎసేసే సైకో… గుండె గుభేల్మనిపించే కథ

 

జీ 5 (Zee 5) లో

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హ్యాక్డ్’ (Hacked). 2020లో విడుదలైన ఈ సినిమాకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. కృష్ణ భట్, అమర్ ఠక్కర్, జతిన్ సేథీలు లోనరేంజర్ ప్రొడక్షన్స్‌పై దీనిని నిర్మించారు. ఇందులో హీనా ఖాన్, రోహన్ షా, మోహిత్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించారు.  2020 ఫిబ్రవరి 7న థియేటర్‌లలో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం జీ 5 (Zee 5) లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×