E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేస్తున్న గుణశేఖర్ యుఫోరియా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీలోకి వచ్చేస్తున్న గుణశేఖర్ యుఫోరియా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement

Euphoria OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గుణశేఖర్ చాలా గ్యాప్ తర్వాత ఇటీవల యుఫోరియా(Euphoria) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శాకుంతలం సినిమా తర్వాత ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన ఈయన సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణను సొంతం చేసుకున్నారు. సీనియర్ నటి భూమిక చావ్లా(Bhumika Chawla), సారా అర్జున్(Sara Arjun) గౌతమ్ మీనన్ వంటి తదితరులు ప్రధానపాత్రలలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.

ఈటీవీ విన్ లో యుఫోరియా

సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా నిజజీవిత ఆధారంగా విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఈటీవీ విన్(Etv Win) సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈటీవీ విన్ ఈ విషయాన్ని తన అధికారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఓ తల్లి, ఓ టీచర్, ఓ బాధాకరమైన నిజం.. యుఫోరియా ఈటీవీ విన్ డిజిటల్ ప్రీమియర్ ఏప్రిల్ 2న ప్రసారం కాబోతోంది అంటూ అధికారికంగా తెలియజేశారు.

Advertisement

కమర్షియల్ గా నిరాశపరిచిన సినిమా

థియేటర్లలో టాక్ పరంగా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇలా కమర్షియల్ గా ఈ సినిమా నిరాశపరిచిన ఒక అద్భుతమైన సోషల్ మెసేజ్ ను మాత్రం ఇచ్చిందని చెప్పాలి.ఇలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న యుఫోరియా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఏ విధమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. భూమిక ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తిరిగి గుణశేఖర్ డైరెక్షన్ లో ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమాలో ధురంధర్ నటి సారా అర్జున్ సైతం కీలక పాత్రలో నటించారు.

Advertisement

ఈ సినిమా కథ విషయానికి వస్తే..హైదరాబాద్‌లో 2022లో జరిగిన ఒక రియల్ లైఫ్ గ్యాంగ్ రే* ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమాలో చైత్ర (సారా అర్జున్) ఐఏఎస్ లక్ష్యంగా చదువుతూ ఉంటారు ఇష్టం లేకపోయినా తన స్నేహితుల బలవంతంతో ఒక పార్టీకి వెళ్ళగా అక్కడ కొంతమంది అబ్బాయిలు తనపై గ్యాంగ్ రే* చేయడంతో చైత్ర ఎలాంటి బాధను అనుభవించింది? ఈ ఘటన కారణంగా చైత్ర కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? చైత్ర తన లక్ష్యాన్ని చేరుకున్నారా ? నిందితులకు శిక్ష పడిందా? అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Also Read: అది ఫేక్..దయచేసి ఎవరూ నమ్మొద్దు అలర్ట్ చేసిన కుష్బూ !

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×