E-Paper
Advertisement

OTT Movie : అమ్మాయి కోసం అడవుల్లో వెతుకుతూ పోలీస్ అదృశ్యం… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : అమ్మాయి కోసం అడవుల్లో వెతుకుతూ పోలీస్ అదృశ్యం… ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీలోకి మరో కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ వచ్చేస్తోంది. ఈ స్టోరీ చాలా కన్ఫ్యూస్ గా సాగుతూ మైండ్ ని బెండ్ చేస్తుంది. ఒక మానసిక సమస్యతో బాధపడే వ్యక్తితో ఈ కథ మొదలవుతుంది. ఒక దట్టమైన అడవిలో మిస్టీరియస్ సంఘటనలు జరుగుతుంటాయి. ఒక పోలీస్ ఎంట్రీతో స్టోరీ మరింత ఇంటెన్స్ గా ఉంటుంది. ఇక ఈ సినిమా మరి కొద్ది గంటల్లో ఓటీటీలో అడుగు పెట్టాయబోతోంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘గ్రీన్’ 2025లో విడుదలైన కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. రాజ్ విజయ్ డైరెక్టర్‌గా, గోపాల్ దేశ్‌పాండే (మయన్నా పాత్రలో), డింపుల్ ఫధ్యా (సావిత్రి), విశ్వనాథ్ మండలిక, బాలాజీ మనోహర్ మెయిన్ కాస్ట్‌లో తెరకెక్కింది. బౌర్న్ ఫిల్మ్స్ & సవికా ఎంటర్‌ప్రైజెస్ ప్రొడక్షన్ నిర్మాణంలో ఈ సినిమా 2025 అక్టోబర్ 24న థియేటర్లలో విడుదల అయింది. 90 నిమిషాల ఈ చిన్న మూవీ, ఐయండిబిలో 8.1/10 రేటింగ్ పొందింది. ఇది నవంబర్ 28 నుండి Sun NXTలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

గ్రీన్ సినిమా పారనాయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. మాయన్న అనే అతను తీవ్రమైన మానసిక సమస్యలతో పోరాడుతుంటాడు. చిన్నతనంలో తన తల్లి చెప్పిన ఒక రాక్షసుడి కథతో అతను తీవ్రంగా ప్రభావితం అవుతాడు. ఆ రాక్షసుడు నిజంగా ఉన్నాడని భ్రమించి, వాస్తవానికి, తన భయాలకు మధ్య తేడాను గుర్తించలేకపోతాడు. ఈ కథ ఎక్కువగా ఒక భయంకరమైన అడవి నేపథ్యంలో జరుగుతుంది. ఈ అడవి కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, మాయన్న కకావికలమైన మనస్సుకు ప్రతీకగా కూడా ఉంటుంది. అతను ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకుని ఒక గందరగోళంలో ఉంటాడు.

Read Also : అమ్మాయిలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

మరో వైపు ఒక పోలిస్ ఇన్‌స్పెక్టర్ అడవిలో తప్పిపోయిన మహిళ కోసం వెతుకుతుంటాడు. అతని వాహనం చెడిపోవడంతో, అతను ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్తాడు, అక్కడ అతను మానసిక సమస్యలతో బాధపడుతున్న మేయన్నను కలుస్తాడు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోతాడు. దీంతో స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. అసలు అడవిలో ఏం జరుగుతుంది ? మాయన్న మానసిక అనారోగ్యం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ?  అమ్మాయి మిస్సింగ్ వెనుక ఎవరున్నారు ? పోలీస్ అదృశ్యం వెనుక ఉన్న మర్మం ఏంటి ? అనే విషయాలను, ఈ కన్నడ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×