E-Paper
Advertisement

Greater Kalesh On Netflix : టెండింగ్ లో ‘గ్రేటర్ కలేష్’… దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా

Greater Kalesh On Netflix : టెండింగ్ లో ‘గ్రేటర్ కలేష్’… దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా
Advertisement

Greater Kalesh On Netflix : దీపావళి సమయంలో ‘గ్రేటర్ కలేష్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాలో దీపావళి పండుగ సమయంలో ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంటాయి. వీటిని దాటి పండుగను ఎలా సెలెబ్రేట్ చేస్తారన్నదే ఈ కథ. భారతదేశం అంతటా పండుగకు ముందు వాతావరణాన్ని ఉపయోగించుకోవడం ద్వారా, ఈ సినిమాకి వ్యూస్ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ప్రజలు కూడా ఈ సినిమాని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘గ్రేటర్ కలేష్’ (Greater kalesh) 2025లో వచ్చిన హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా. అదిత్య చందీఓక్ దర్శకత్వంలో అహసాస్ చన్నా, పూజన్ చబ్రా, సుప్రియా శుక్లా, హ్యాపీ రణజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

ట్వింకిల్ అనే యువతి ఢిల్లీలో జీవిస్తుంటుంది. ఆమె దీపావళి సమయంలో కుటుంబాన్ని సర్‌ప్రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఆమె గ్రేటర్ కలేష్ అనే హై క్లాస్ కాలనీలో ఉండే తన కుటుంబం ఇంటికి వస్తుంది. కానీ అక్కడ ఆమె ఊహించినట్టు ఉండదు. ట్వింకిల్ కుటుంబం మధ్య అందరూ ఎడమొహం, పెడ మొహం పెట్టుకుని ఉంటారు. ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దవి అవుతాయి. ఇక ట్వింకిల్ తన సర్‌ప్రైజ్ ప్లాన్‌ బెడిసి కొడుతుంది. ఆమె తన కుటుంబ పరిస్థితిని చూసి టెన్షన్ అవుతుంది.

Read Also : మార్చురీలో వరుస మర్డర్స్… 30 ఏళ్ల తరువాత మళ్ళీ మొదలుపెట్టే సీరియల్ కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Advertisement

ఓ వైపు దీపావళి పండుగ, మరోవైపు ఫ్యామిలీ సమస్యలతో కథ లో ట్విస్ట్లు కూడా వస్తాయి. ట్వింకిల్ మధ్యలో ఇరుక్కుని, అందరినీ కలిపి, సమస్యలు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ కుటుంబం మధ్య గొడవలు పెరుగుతాయి. దీపావళి ప్రిపరేషన్స్ మధ్య ఎమోషన్స్ ఎక్కువవుతాయి. ట్వింకిల్ తన కుటుంబం గురించి మరింత తెలుసుకుంటూ, తన జీవితం గురించి కూడా ఆలోచిస్తుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపు తీసుకుంటుంది. ఈ మలుపు ఏమిటి ? ఈ ఫ్యామిలీలో గొడవలు ఎందుకు జరుగుతాయి ? ట్వింకిల్ వీళ్ళను కలుపుతుందా ? వీళ్ళంతా కలిసి దీపావళి సంబరాలు చేసుకుంటారా ? అనే విషయాలను, ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×