E-Paper
Advertisement

OTT Movie : పెళ్లీడు పిల్లలుండగా పక్కింటి ఆంటీ ఇంట్లోకి… ఫైట్స్ లేవు, రొమాన్స్ లేదు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్

OTT Movie : పెళ్లీడు పిల్లలుండగా పక్కింటి ఆంటీ ఇంట్లోకి… ఫైట్స్ లేవు, రొమాన్స్ లేదు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్
Advertisement

OTT Movie : ఒక చక్కని ఫీల్ గుడ్ ఫ్యామిలీని చూడాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ పండుగ స్పెషల్ కి, అలాంటి సినిమాలు చూస్తే వచ్చే ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ నేపథ్యంలో దీపావళి స్పెషల్ కి, ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. దీపావళిని ఫ్యామిలీతో సెలెబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఎమోషనల్, కామెడీ థీమ్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలితో కలసి చూడాల్సిన చూడ చక్కని సినిమా ఇది.  దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘గ్రేటర్ కైలాష్’ (Greater kailash movie) 2025లో వచ్చిన బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అదిత్య చండీవోక్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో ట్వింకిల్ అహసాస్ చన్నా, సుప్రియా శుక్ల, కాలన్ మల్వ, హ్యాపీ రానాజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 17లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

ట్వింకిల్ బెంగళూరులో జాబ్ చేస్తూ, దీపావళి పండగ కోసం ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్‌లో తన ఇంటికి వస్తుంది. ఆమె తల్లి, తండ్రి, తమ్ముడితో సంతోషంగా దీపావళి జరుపుకోవాలని అనుకుంటుంది. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత, కుటుంబంలో కొన్ని సమస్యలు బయటపడతాయి. తల్లి, తండ్రి మధ్య గొడవలు, డబ్బు ఇబ్బందులు, ఇల్లు అమ్మాలనే ఆలోచన ఉన్నాయని ఆమెకు తెలుస్తుంది. ట్వింకిల్ ఈ సమస్యలను సరిచేసి, ఫ్యామిలీతో కలసి, దీపావళిని హ్యాపీగా జరపాలని ప్లాన్ చేస్తుంది. మొదట్లో కోపం తెచ్చుకున్న ట్వింకిల్, ఆ తరువాత కుటుంబ సమస్యలను తెలుసుకుంటుంది. తల్లి, తండ్రి మధ్య గొడవలు ఎందుకు జరిగాయి, ఆర్థిక ఇబ్బందులు ఎలా వచ్చాయి, ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నారో అర్థం చేసుకుంటుంది.

Read Also : ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ పై పన్ను… ఫ్యామిలీతో చూడకూడని సీన్లున్న హిస్టారికల్ మూవీ

Advertisement

ఇంతలో ఇక్కడ లవ్ స్టోరీలు కూడా ఎంట్రీ ఇస్తాయి. ట్వింకిల్ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంటుంది. అలాగే ఆమె తమ్ముడు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి. ఇది ఇలా ఉంటే, ట్వింకిల్ తండ్రి వేరొకరితో ఎఫైర్ నడుపుతున్నట్లు వీళ్ళు అపార్థం చేసుకుంటారు. చివరికి వీళ్ళ గొడవలు సమసిపోతాయా ? దీపావళి పండుగను కలసి చేసుకుంటారా ? ఇంటి సంగతి ఏమవుతుంది ? అనే విషయాలను, ఈ బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×