E-Paper
Advertisement

OTT Movie : దెయ్యం నుంచి ఓనర్‌ను రక్షించే డాగ్… ఇలాంటి హర్రర్ మూవీని మీ లైఫ్‌లో చూసుండరు భయ్యా

OTT Movie : దెయ్యం నుంచి ఓనర్‌ను రక్షించే డాగ్… ఇలాంటి హర్రర్ మూవీని మీ లైఫ్‌లో చూసుండరు భయ్యా
Advertisement

OTT Movie : ఎన్నో సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని సినిమాలకు దర్శకులు వినూత్న ప్రయోగాలు చేస్తుంటారు. అవి సక్సెస్ కూడా అవుతుంటాయి. రీసెంట్ గా ఒక మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరో పాత్రలో ఒక కుక్క నటించింది. దర్శకుడు తన పెంపుడు కుక్కను పెట్టి, అది కూడా హారర్ జానర్లోఓ సినిమా తీశాడు. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో కూడా అందుబాటులోకి వచ్చింది. కుక్కలు తరచుగా మానవుల కంటే ముందే దయ్యాలను పసిగడతాయని గమనించిన తర్వాత, అతను ఈ చిత్రానికి మొదటి సారిగా ఆలోచనచేశాడు. అతని పెంపుడు కుక్క ప్రధాన పాత్రలో హాంటెడ్ ఒక హౌస్ చిత్రాన్ని రూపొందించాడు. జంతు ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘గుడ్ బాయ్’ 2025లో విడుదలైన అమెరికన్ సూపర్ నేచురల్ హర్రర్ చిత్రం. దీనికి బెన్ లియోన్‌ బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఈ దర్శకుడి పెంపుడు కుక్క నోవా స్కోటియా, ఇండీ పాత్రలో నటించింది. షేన్ జెన్సెన్, అరియెల్ ఫ్రైడ్‌మాన్ లారీ ఫెస్సెండెన్ సహాయక పాత్రల్లో నటించారు. 2025 అక్టోబర్ 3న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టింది. నవంబర్ 21 నుంచి shudder ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఇండీ అనే చిన్న కుక్క తన ఓనర్ టాడ్‌తో కలిసి ఒక పాత ఇంట్లోకి మారుతుంది. మొదట్లో అంతా సూపర్ హ్యాపీగా ఉంటుంది. ఇండీ ఫుల్ జోష్‌తో ఆడుకుంటూ, టాడ్‌ని రోజంతా అనుసరిస్తూ ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఇండీకి మాత్రమే కనిపించే భయంకరమైన విషయాలు మొదలవుతాయి. గోడల్లో నల్లటి నీడలు కదులుతాయి, రాత్రి ఏదో టాడ్ మెడ మీద చేతులు వేస్తుంది. మనుషులకి ఏమీ కనిపించదు కానీ ఇండీ రోజూ రాత్రి ఒంటరిగా దెయ్యంతో ఫైట్ చేసి టాడ్‌ని కాపాడుతుంది. టాడ్‌కి మెడ మీద గీతలు పడతాయి, గాయాలు అవుతాయి కానీ అతనికి ఏమీ గుర్తు ఉండదు. ఇండీనే ఇలాంటి చిలిపి పనులు చేస్తోందని రివర్స్ లో దానినే తిట్టేస్తాడు టాడ్‌.

Read Also : భార్యా పిల్లలు ఉండగా మరో అమ్మాయితో… ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్

ఒక రోజు రాత్రి దెయ్యం ఫుల్ ఫోర్స్‌తో టాడ్‌ని చంపేస్తానని వస్తుంది. ఇండీ తన ప్రాణం పణంగా పెట్టి దెయ్యం మీదకి దూకుతుంది. ఆ ఫైట్‌లో ఇండీ చనిపోతుంది. టాడ్ లేచి చూసేసరికి ఇండీ రక్తంలో పడుకుని ఉంటుంది. కానీ ఎండింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఇండీ ఇప్పుడు దెయ్యమైపోయి కూడా టాడ్ కారు వెనక సీట్‌లో కూర్చుని తోక ఊపుతూ ఉంటుంది. అంటే తన ఓనర్‌ని ఎప్పటికీ వడాలనని, ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటానని చెప్పకనే చెబుతుంది. ఆ లాస్ట్ సీన్ చూస్తే అందరికీ కళ్లు చెమ్మగిల్లుతాయి.
Advertisement

 

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×