E-Paper
Advertisement

OTT Movie : పరిచయం లేని అబ్బాయితో ఆ పని.. భర్తనే మరో మగాడు కావాలని అడిగే అమ్మాయి… మైండ్ బ్లాక్ ట్విస్టులు

OTT Movie :  పరిచయం లేని అబ్బాయితో ఆ పని.. భర్తనే మరో మగాడు కావాలని అడిగే అమ్మాయి… మైండ్ బ్లాక్ ట్విస్టులు
Advertisement

OTT Movie : అందాల నటి అనుపమ పరమేశ్వరన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అమ్మడు ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించిందన్న సంగతి మీకు తెలుసా? అవును ఆమె ఒక మలయాళం షార్ట్ ఫిల్మ్ లో పవర్ ఫుల్ రోల్ చేసింది. ఆమె అద్భుతమైన నటన, రియలిస్టిక్ డైలాగ్‌లకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామాను మీరు కూడా చూసేయండి. ఇది తెలుగులో కూడా ఉందండోయ్. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

యూట్యూబ్ లో

Advertisement

‘ఫ్రీడమ్ @ మిడ్‌నైట్’ (Freedom @ Midnight) 2021లో విడుదలైన మలయాళం షార్ట్ ఫిల్మ్. ఇది ఆర్.జే. షాన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (చంద్ర), హక్కీం షాజహాన్ (దాస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 29 నిమిషాల నిడివితో, ఈ షార్ట్ ఫిల్మ్ ఒక గృహిణి వివాహంలో వివాహం జీవితంలో జరిగే సంఘటనలచుట్టూ తిరుగుతుంది. ఇది 2021, జనవరి 9 న YouTubeలో విడుదలైంది. ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అనుపమ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. IMDb లో దీనికి 7.7/10 రేటింగ్ కూడా ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

ఈ కథ కేరళలోని చంద్ర (అనుపమ పరమేశ్వరన్) అనే గృహిణి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన వివాహ జీవితంలో అసంతృప్తిగా ఉంటుంది. ఒక సాయంత్రం వర్షం కురుస్తున్న సమయంలో,చంద్ర తన భర్త దాస్ (హక్కీం షాజహాన్)తో ఒక విషయాన్ని చర్చించాలని నిర్ణయించుకుంటుంది. ఆమె షాకింగ్‌గా తనకు లైం*గిక స్వేచ్ఛ కావాలని, ఒక వ్యక్తితో తాను ఫాంటసీలు కలిగి ఉన్నానని చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ విషయం దాస్‌ను కలవరపెడుతుంది. ఇద్దరి మధ్య తీవ్రమైన వాదన జరుగుతుంది. చంద్ర తన భర్తతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతోంది? ఆమె నిజంగా స్వేచ్ఛ కోరుకుంటోందా ? లేక ఇందులో ఏదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు కథను ముందుకు నడిపిస్తాయి.

Read Also : ఫీలింగ్స్ రావట్లేదని పిచ్చి పని… అబ్బాయి కాదంటున్నారని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

ఈ క్రమంలో దాస్ శారీరక సుఖం కోసమే చంద్రను పెళ్ళి చేసుకున్నట్లు తెలిసి ఆమె బాధ మరింత ఎక్కువ అవుతుంది. ఇక్కడ డైలాగ్‌లు కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. సినిమా చివరలో ఒక షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. సినిమా ఓపెన్ ఎండింగ్‌తో ముగుస్తుంది. చంద్ర తన భర్తతో సయోధ్యకు వస్తుందా ? లేక విడిపోతుందా ? మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంటుందా ? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ మలయాళం షార్ట్ ఫిల్మ్ ను చూసి తెలుసుకోండి.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×