// // OTT Thriller Web Series : 'ఆశ్రమ్' కంటే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు... -->
E-Paper
Advertisement

OTT Thriller Web Series : ‘ఆశ్రమ్’ కంటే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా

OTT Thriller Web Series : ‘ఆశ్రమ్’ కంటే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్లు… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా
Advertisement

OTT Thriller Web Series : బాబీ డియోల్ ‘ఆశ్రమం’ ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన సిరీస్. కానీ ఈ రోజు మనం అంతకు మించి అన్నట్లు ఉండే 5 అద్భుతమైన క్రైమ్-థ్రిల్లర్ సిరీస్ గురించి తెలుసుకుందాం. వీటిలో ప్రతి సీన్ సస్పెన్స్‌తోనే నడుస్తాయి. ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లకు క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. చాలా కాలంగా వార్తల్లో నిలిచిన కొత్త సీజన్‌ల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ‘ఢిల్లీ క్రైమ్స్ 3’ లాంటి సిరీస్ లు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి సిరీస్ ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

‘స్పెషల్ ఆప్స్’ (Special ops)

జియో హాట్‌స్టార్‌లోని అత్యుత్తమ వెబ్ సిరీస్‌లలో ఒకటైన “స్పెషల్ ఆప్స్” రెండు భాగాలుగా విడుదలైంది. ఇవి రెండూ హిట్ అయ్యాయి. ఈ సిరీస్ మొదటి సీజన్ RAW ఏజెంట్ హిమ్మత్ సింగ్ కథను చూపిస్తుంది. రెండవ సీజన్ కథలో హిమ్మత్ సింగ్ అతని బృందం భారతదేశంపై చైనా ఒక పెద్ద సైబర్ దాడికి ప్లాన్ చేస్తుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఒక సీక్రెట్ మిషన్‌ను ప్రారంభింస్తారు. మొదటి సీజన్ 2020లో, రెండవ సీజన్ 2025న జూలై 11నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

పాతాల్ లోక్ (Patal lok)

Advertisement

జైదీప్ అహ్లవత్ నటించిన ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2020 లో విడుదలై సూపర్ హిట్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. 2025 జనవరి 17న పాతాళ్ లోక్ 2 ను కూడా విడుదల చేశారు. దీనిని కూడా ఆడియన్స్ తెగ చూడటం మొదలెట్టారు. ఈ కథలో జీవితం మీద విరక్తితో ఉన్న ఒక పోలీస్ కి అనుకోకుండా ఒక పెద్ద కేసు తగులుతుంది. దీంతో అతని జీవితంతో పాటు, కేసు రూపు రేకలు కూడా మారిపోతాయి. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

‘ఫ్యామిలీ మ్యాన్’ (Family man)

‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ 2025 నవంబర్ 21న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది. నటుడు మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ తివారీగా తిరిగి రానున్నారు. జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ కూడా ఈ సిరీస్ లో కనిపిస్తారు. దీని కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

‘ఢిల్లీ క్రైమ్’ (Delhi crime)

Advertisement

‘ఢిల్లీ క్రైమ్స్’ సీజన్ 3 : 2025 నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చింది. DCP వర్తిక చతుర్వేది అమ్మాయిల అక్రమ రవాణా కేసును ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. 2012 బేబీ ఫలక్ కేసు నుండి ప్రేరణ పొందిన ఈ సీజన్, గాయాలతో హాస్పిటల్ లో వదిలేసిన ఒక చిన్న పాపతో మొదలవుతుంది. ఈ స్కాండిల్ కి ఒక లేడీ డాన్ హెడ్ గా ఉంటుంది. ఆమెను పట్టుకునే క్రమంలో ఈ సిరీస్ ఉత్కంఠ భరితంగా ఉంటుంది.

‘కిల్లర్ సూప్’ (Killer soup)

ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు అభిషేక్ చౌబే దర్శకత్వం వహించాడు. మనోజ్ బాజ్‌పేయ్, కొంకణా సేన్ శర్మ, సాయాజీ షిండే, నాజర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్‌ ను, జనవరి 11న హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేశారు. ఈ సిరీస్ లను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే అప్పడం కష్టమే.

 

Read Also : కోటి కట్టకపోతే ఇంట్లోంచి గెంటేస్తామని వార్నింగ్… ముసలావిడ మాస్టర్ ప్లాన్ కు హ్యాట్సాఫ్ భయ్యా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×