E-Paper
Advertisement

Romantic movie OTT: కట్టుకున్న దాన్ని మోసం చేసి మరొకరితో భర్త… భార్య ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు ఔట్

Romantic movie OTT: కట్టుకున్న దాన్ని మోసం చేసి మరొకరితో భర్త… భార్య ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు ఔట్
Advertisement

Romantic movie OTT : భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ ఎంత ముఖ్యమో, ఇప్పుడు చెప్పూకోబోయే సినిమా చూస్తే తెలుస్తుంది. కేవలం వివాహేతర సంబంధాల గురించి మాత్రమే కాకుండా, మహిళల ఎమోషన్స్ ను చాలా ధైర్యంగా చూపించిన సినిమా ఇది. రష్యన్ చిత్ర పరిశ్రమలో మహిళల శృంగార కోరికలను ఇంత బహిరంగంగా, ఎటువంటి మొహమాటం లేకుండా చూపించడం ఒక పెద్ద సాహసంగా చెప్పుకుంటారు. ఇందులో కొన్ని సన్నివేశాలు చాలా బోల్డ్‌గా ఉంటాయి. కాబట్టి ఈ సినిమా పెద్దలకు మాత్రమే. అదికూడా ఒంటరిగా చూడటమే మంచింది.

ఏ ఓటీటీలో ఈ సినిమాను చూడచ్చు అంటే

ఈ సైకలాజికల్ డ్రామా సినిమా పేరు ‘ఫిడిలిటీ’ (Fidelity). ఈ సినిమా రష్యన్ భాషలో ‘వెర్నోస్ట్’ (Vernost) అనే పేరుతో విడుదలైంది. ఇది 2019లో రష్యాలో విడుదలైనప్పటికీ, 2021లో అంతర్జాతీయంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో బాగా పాపులర్ అయింది. నిగినా సైఫుల్లేవా దర్శకత్వంలో ఇది రూపొందింది. ఆమె ఒక మహిళా దర్శకురాలు కావడంతో, ఈ కథను ఒక మహిళా కోణం నుండి చాలా సున్నితంగా చూపించారు. ముఖ్యంగా లెనా పాత్రలో నటించిన ఎవ్జీనియా గ్రోమోవా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఒక వైపు గృహిణిగా, మరోవైపు తన కోరికల కోసం పరితపించే మహిళగా ఆమె చూపించిన హావభావాలు సినిమాకు ప్రాణం పోశాయి. 2019లో జరిగిన 30వ రష్యన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాకు ‘స్పెషల్ జ్యూరీ డిప్లొమా’ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా ప్రస్తుతం Tubi, Apple TV ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

కథ ఏమిటంటే

Advertisement

లెనా ఒక సక్సెస్‌ఫుల్ డాక్టర్, ఆమె భర్త సెర్గీ థియేటర్ ఆర్టిస్ట్. వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నా, చాలా కాలంగా శారీరక సంబంధం ఉండదు. ఒకరోజు సెర్గీ ఫోన్‌లో వేరే అమ్మాయి పంపిన మెసేజ్ చూసిన లెనా, తన భర్త తనను మోసం చేస్తున్నాడని బలంగా నమ్ముతుంది. ఆ బాధలో ఉన్న లెనా తన భర్తను నేరుగా నిలదీయకుండా, రివేంజ్ తీర్చుకోవడానికి అపరిచితులతో సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెడుతుంది. మొదట్లో కేవలం భర్తపై కోపంతోనే ఇలా చేసినా, క్రమంగా ఇది ఆమె జీవితంలో ఒక అలవాటుగా మారిపోతుంది. ఆమె నడుపుతున్న ఈ డబుల్ లైఫ్ వల్ల అటు ఉద్యోగం, ఇటు వైవాహిక జీవితం రెండూ ప్రమాదంలో పడతాయి. తన భర్త నిజంగానే తనను మోసం చేస్తున్నాడా అనే అనుమానం, ఆమె చేస్తున్న పనుల వల్ల ఎదురయ్యే పరిణామాలతో ఈ సినిమాను చివరి వరకు ఉత్కంఠభరితంగా నడుస్తుంది.

Read Also : మ్యూజిక్ రాపర్ అవ్వాలనుకునే పిజ్జా బాయ్… మాట్లాడే బాతుతో కష్టాలు… ప్రతి ఎపిసోడ్ సరదాగా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×