E-Paper
Advertisement

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా కుప్పలుగా శవాలు… బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా కుప్పలుగా శవాలు… బ్లాక్ మ్యాజిక్ తో వణుకు పుట్టించే హర్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కొన్ని హర్రర్ సినిమాలు పగలు చూసినా, రాత్రి చూసినా పెద్దగా తేడా ఏం ఉండదు. గుండె గభేల్ మనిపించే సీన్స్ తో వణుకు పుట్టిస్తుంటాయి. సినిమా అయిపోయిన తరువాత కూడా గజ గాజా వణికిపోతుంటారు. అటువంటి సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అటువంటిదే. ఒక జంట జరిపే తాంత్రిక శక్తి వల్ల, కొంత మంది మనుషులు ఆకల మరణం పొందుతారు. ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో మొదలౌతుంది.  ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

సోఫియా, ఎవా అనే ఇద్దరు టీనేజ్ సిస్టర్స్ ల జీవితం సరదాగా సాగిపోతుంటుంది. అయితే ఒక రోజు వీళ్ళ తల్లిదండ్రులు, ఒక గుహ దగ్గర భయంకరమైన కల్ట్ ఆచారంలో పాల్గొంటారు.  దాని ఫలితంగా 23 మంది మరణించారని తెలుస్తుంది. ఆ మరణించిన వాళ్ళ ఒంటిమీద బట్టలు కూడా లేకుండా నగ్నంగా ఉంటారు. ఈ సంఘటన వల్ల వీళ్ళ జీవితాలు తలక్రిందులు అవుతాయి. ఆ గ్రామంలోని ప్రజలు వీళ్ళ తల్లిదండ్రులను దోషులుగా అనుమానిస్తుంటారు. దీంతో ఈ అక్కాచెల్లెళ్ళు సమాజంలో అనుమానాలను ఎదుర్కొంటారు. నిజానికి ఈ కల్ట్ ఆచారాన్ని, ఆ ప్రాంతంలో ఎప్పటినుంచో నిషేధించి ఉంటారు. ఆ ఊరికి దగ్గరలో ఒకప్పుడు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, సోఫియా తల్లిదండ్రులు తెలుసుకుంటారు.

నిద్రావస్థలో ఉన్న ఆ శక్తులను వీళ్ళు మళ్ళీ మేలుకొనేలా చేస్తారు. ఆ తరువాత ఈ గ్రామంలో వరుస మరణాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు ఈ సిస్టర్స్ తన తల్లిదండ్రుల గురించి రహస్యాలను, ఈ ఆచారం వెనుక ఉన్న వాస్తవాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. చివరికి ఈ అక్కాచెల్లెళ్ళు తన తల్లిదండ్రుల గురించి ఏం తెలుసుకుంటారు ? ఆ ప్రాంతంలో చేతబడి నిజంగానే జరిగిందా ? వీటి వెనుక ఉన్న రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : ఆ ఇంట్లో రెంట్ కు అడుగు పెట్టడం అంటే నరకంలోకి వెళ్ళడమే… గూస్ బంప్స్ తెప్పించే సైకలాజికల్ థ్రిల్లర్

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ స్పానిష్ సూపర్‌ నాచురల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఫెరియా: ది డార్కెస్ట్ లైట్’ (Feria: The Darkest Light). దీనిని అగస్టిన్ మార్టినెజ్, కార్లోస్ మోంటెరోచే రూపొందించారు. ఈ సిరీస్ స్టోరీ స్పెయిన్‌లోని ఆండలూసియా అనే ఒక చిన్న పట్టణం ఫెరియాలో జరుగుతుంది. ఈ స్టోరీ ప్రధానంగా సోఫియా, ఎవా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు చుట్టూ తిరుగుతుంది. ఈ హారర్ సిరీస్ 2022 జనవరి 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×