E-Paper
Advertisement

Feel Good Movie OTT : కన్న నేల చేరలేక విదేశీ గడ్డపై రాలిన వలస ప్రాణం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మూవీ

Feel Good Movie OTT : కన్న నేల చేరలేక విదేశీ గడ్డపై రాలిన వలస ప్రాణం… ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్న మూవీ
Advertisement

Feel Good Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ గా ఒక ఎమోషనల్ మూవీ ఆకట్టుకునే కంటెంట్ తో వచ్చింది. ఇది బిష్ణు అనే ఒక వృద్ధుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బిష్ణు అమెరికాలో స్థిరపడ్డ ఒక భూటాన్ శరణార్థి. తన జీవితాంతం ఒకసారైనా తన మాతృభూమి అయిన భూటాన్‌కు వెళ్లాలనేది అతని కోరిక. ఈ కథ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. 1990లలో భూటాన్ ప్రభుత్వం చాలా మందిని దేశం నుండి వెళ్లగొట్టింది, వాళ్ళ బాధలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో, నేపాల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్కడి వాతావరణం, ఆ మనుషుల లైఫ్ స్టైల్ ను చాలా రియలిస్టిక్ గా తీశారు. ఇక సినిమాలో నేపాల్, భూటాన్ సంస్కృతికి అద్దం పట్టేలా సంగీతం ఉంటుంది. ఇది సినిమాలోని ఎమోషన్స్‌ను పీక్స్‌కి తీసుకెళ్తుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సినిమా పేరు ‘ది వరల్డ్స్ హ్యాపియెస్ట్ మ్యాన్’ (The World’s Happiest Man). దీనికి ‘భూటాన్’ (Bhuthan) అనే మరో పేరు కూడా ఉంది. ఇది ఏప్రిల్ 25, 2025న నేపాల్‌లో విడుదలైంది. ఈ సినిమాలో విశేషం ఏంటంటే, రెండుసార్లు ఆస్కార్ నామినేట్ అయిన హాలీవుడ్ లెజెండ్ బ్రూస్ డెర్న్ నేపాల్ స్టార్ నటులు హరి బన్షా ఆచార్య, దయాహంగ్ రాయ్ కలిసి నటించారు. ఇలాంటి కాంబినేషన్ రావడం చాలా అరుదు. ఇక వినోద్ పౌడెల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వినోద్ పౌడెల్ గతంలో తీసిన ‘బుల్బుల్’ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను కూడా ఆయన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందించారు. ఈ సినిమా 2026 జనవరి 9 నుండి Prime video, Apple TV, Fandango ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి వచ్చింది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అమెరికాలో సెటిలైన బిష్ణు అనే ముసలాయన కథ ఇది. అతను పుట్టి పెరిగింది భూటాన్ దేశంలోనే అయినా, లోకల్ గొడవల వల్ల ఇల్లు వాకిలి వదిలేసి అమెరికాకు పోయి అక్కడే స్థిరపడిపోతాడు. కానీ వయసు పైబడే కొద్దీ చచ్చేలోపు ఒక్కసారైనా నా సొంత ఊరు మొహం చూడాలి, ఆ గాలి పీల్చాలని తెగ ఆశ పడతాడు. తీరా వీసా కోసం అప్లై చేస్తే, అక్కడి గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తుంది. ఆ బాధ తట్టుకోలేక, తన కోరిక తీరకుండానే ఆ ముసలాయన కన్నుమూస్తాడు. ఆయన చనిపోయాక అసలు పంచాయతీ మొదలవుతుంది. అతని ఆఖరి కోరిక ప్రకారం తన శవాన్ని మాతృభూమికి పంపించి అక్కడే అంత్యక్రియలు చేయాలని కొందరు కుటుంబ సభ్యులు పట్టుబడతారు. కానీ ఇంకొందరు మాత్రం ఇక్కడికి వచ్చి ఇన్నేళ్లయింది కదా, అమెరికాలోనే కానిచ్చేద్దాం అంటారు. ఈ లోపు ఆ దేశపు చట్టాలు, వీసా గొడవలతో పరిస్థితి ఇంకాస్త గందరగోళంలో పడుతుంది. చివరికి ఆ పెద్దాయన అంత్యక్రియలు సొంత ఊరిలోనే జరుగుతాయా ? ఆ పెద్దాయన చివరికోరిక తీరుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also :  తెలివితేటలతో హైలెట్ అయ్యే తీర్పులు… రెండేళ్లుగా టాప్ ట్రెండింగ్ లో లీగల్ డ్రామా… ఐయండిబిలో 8 రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×