E-Paper
Advertisement

నిలువ నీడ లేని ఓ జంట ప్రయాణం… ఎమోషన్స్ తో కన్నీళ్లు పెట్టించే కథ

నిలువ నీడ లేని ఓ జంట ప్రయాణం… ఎమోషన్స్ తో కన్నీళ్లు పెట్టించే కథ
Advertisement

Feel Good Movie OTT: సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తుంటారు ప్రేక్షకులు. అయితే కొన్ని సినిమాలు ఆడియన్స్ కు మరచిపోలేని అనుభూతులను ఇస్తుంటాయి. ఒక్క సారి చూస్తే మరచిపోలేం కూడా. అలాంటి సినిమా గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ సినిమాలో అన్ని కోల్పోయి, నిలువనీడ లేని ఒక జంట సుమారు వెయ్యి కిలోమీటర్ల నడక మొదలు పెడుతుంది. ప్రకృతి మాత్రమే వీళ్ళకు తోడుగా నిలిచి ధైర్యాన్ని ఇస్తుంది. సినిమాను అలా చూస్తుంటే వచ్చే ఫీలింగ్స్ కూడా చాలా బాగుంటాయి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ బ్రిటిష్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ది సాల్ట్ పాత్’ (The Salt Path). మరియాన్ ఇలియట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో గిల్లియన్ ఆండర్సన్ (రేనర్ విన్‌గా), జేసన్ ఐసాక్స్ (మోత్ విన్‌గా) తమ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ 2024 సెప్టెంబరులో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. ఆ తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2025 మే 30న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతానికి ఈ సినిమా Amazon Prime Video, Apple tv ప్లాట్‌ఫారమ్‌లలో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

రేనర్, మోత్ అనే మిడిల్ ఏజ్ లో ఉండే భార్యా భర్తలు హాయిగా బతుకుతుంటారు. కానీ ఒకేసారి కోర్టు గొడవల్లో ఆస్తిపాస్తులతో పాటు, ఉన్న ఇల్లు అన్నీ పోతాయి. అదే టైమ్‌లో భర్త మోత్‌కు నయం కాని జబ్బు ఉందని, ఇంకో కొన్ని రోజులే బతుకుతాడని డాక్టర్లు చేతులెత్తేస్తారు. ఉన్నట్టుండి రోడ్డున పడ్డ ఆ ఇద్దరికీ ఏం చేయాలో పాలుపోదు. చేతిలో చిల్లిగవ్వ లేదు, తలదాచుకోవడానికి నీడ లేదు.. కళ్లముందు అంతా చీకటే కనిపిస్తుంది. కానీ ఆ చావుకు భయపడి ఇంట్లోనే కూర్చుని ఏడవడం కంటే, ఉన్న కొద్ది రోజులు కలిసి నడుద్దామని డిసైడ్ అవుతారు. కేవలం ఒక చిన్న టెంట్, కొన్ని బట్టలు సర్దుకుని.. ఇంగ్లాండ్‌లోని 630 మైళ్ల పొడవున్న సముద్రపు గట్టు వెంట నడక మొదలుపెడతారు.

తిండికి తిప్పలు, ఎండకు ఎండి, వానకు తడిసి.. అడుగడుగునా కష్టాలు ఎదురైనా సరే, ఒకరి చేతిని ఒకరు వదలకుండా ఆ అడవి దారుల్లో, కొండల మీద ముందుకు సాగుతారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్లు ప్రకృతిని చూసి చాలా నేర్చుకుంటారు. ఆస్తి పోయినా, ఆరోగ్యం పాడైనా.. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం ఉంటే చాలని అర్థం చేసుకుంటారు. ఆశ్చర్యంగా ఆ నడక వల్ల మోత్ ఆరోగ్యం కూడా కొంత మెరుగవుతుంది. చివరకు వాళ్లు గమ్యాన్ని చేరుకునే సరికి, పోగొట్టుకున్న ఆస్తి కంటే.. తిరిగి సంపాదించుకున్న మనశ్శాంతి గొప్పదని ఈ కథ మనకు చెబుతుంది.

Advertisement

Read Also : ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న 26 ఏళ్ల హాలీవుడ్ మూవీ… యాక్టింగ్ ఇరగదీసిన బ్రాడ్ పిట్… ఐయండిబిలో 8.8 రేటింగ్

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×