E-Paper
Advertisement

Feel good Movie OTT: అప్పు కోసం కూతుర్ని తాకట్టు… కన్నీళ్లు పెట్టించే కామెడీ మూవీ

Feel good Movie OTT: అప్పు కోసం కూతుర్ని తాకట్టు… కన్నీళ్లు పెట్టించే కామెడీ మూవీ
Advertisement

Feel good Movie OTT : రోజు రోజుకి కొరియన్ సినిమాల ఫ్యాన్స్ ఎక్కువ అవుతున్నారు. దీనికి కారణం అక్కడ నుంచి వస్తున్న ఫీల్ గుడ్ స్టోరీలే. మంచి కంటెంట్ తో మనసంతా దోచేస్తున్నాయి ఈ కొరియన్ సిరీస్ లు, సినిమాలు. ఈ నేపథ్యంలో ఒక కొరియన్ మూవీ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ తెగ చూసారు కూడా. కొరియాలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయిన ఈ సినిమా, క్లైమాక్స్లో లో కన్నీళ్లు కూడా పెట్టిస్తుంది.

ఎక్కడ చూడవచ్చు?

ఈ కొరియా ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా పేరు ‘పాన్’ (Pawn). 2020లో వచ్చిన ఈ అద్భుతమైన సినిమా, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. కాంగ్ డే-గ్యు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో సుంగ్ డాంగ్-ఇల్, హా జి-వోన్, కిమ్ హీ-వోన్, చైల్డ్ ఆర్టిస్ట్ పార్క్ సో-యి లీడ్ రోల్స్ లో ఉన్నారు. ఈ చిత్రం 2020 సెప్టెంబర్ 29న థియేటర్‌లలో విడుదలైంది. ఇది 2020లో అత్యధిక వసూళ్లు చేసిన కొరియన్ చిత్రంగా ఆరవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం Viki, Amazon Prime Video, Netflix ఓటీటీలలో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి, అందుకే దీనిని ‘హార్ట్ వార్మింగ్ టియర్ జెర్కర్’ అని కూడా పిలుస్తారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1993లో ఇంచియాన్ పట్టణంలో దూ-సోక్, జోంగ్-బే అనే ఇద్దరు మొరటు వ్యక్తులు ఉంటారు. అప్పులు ఇచ్చి కనికరం లేకుండా వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక మహిళ దగ్గరకు వెళ్తారు. ఆమె అప్పు తీర్చలేకపోవడంతో, గ్యారెంటీగా ఆమె 9 ఏళ్ల కూతురు సంగ్-యిని తీసుకెళ్తారు. అయితే ఆ తల్లి అక్రమ వలసదారు కావడంతో పోలీసులు ఆమెను వెంటనే దేశం నుంచి పంపించేస్తారు. దీంతో ఆ చిన్నారిని ఎవరికి అప్పగించాలో తెలియక, ఆ ఇద్దరు ఆ అమ్మాయిని చూసుకోవాల్సి మారాల్సి వస్తుంది.

మొదట్లో ఆ అమ్మాయిని ఒక భారంగా భావించినా, మెల్లమెల్లగా ఆ చిన్నారి అమాయకత్వం ఆ ఇద్దరి మనసులను కరిగిస్తుంది. ముఖ్యంగా దూ-సోక్ ఆ అమ్మాయిని తన సొంత కూతురిలా చూసుకోవడం మొదలుపెడతాడు. ఆమెను మంచి స్కూల్లో చేర్పించి చదివిస్తాడు కూడా. అలా రక్తం సంబంధం లేకపోయినా, ఒక అద్భుతమైన తండ్రీ, కూతుళ్ల బంధం ఏర్పడుతుంది వాళ్ళ మధ్య. ఆ అమ్మాయి కూడా వారిని తన సొంత నాన్న, బాబాయ్ లాగే ప్రేమిస్తుంది.

Advertisement

ఇక సంగ్-యి పెద్దయి మంచి ఉద్యోగంలో చేరుతుంది. అయితే ఒకానొక సమయంలో దూ-సోక్ ప్రమాదానికి గురై కనిపించకుండా పోతాడు. పదేళ్ల పాటు అతని కోసం వెతికిన సంగ్-యి, చివరికి ఒక ఆసుపత్రిలో జ్ఞాపకశక్తి కోల్పోయిన స్థితిలో అతన్ని గుర్తిస్తుంది. ఈ సినిమాలో ఈ సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయి. మరి ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటే,ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.

Read Also : భర్త పోయాక మరొకరితో… ఎవరూ చూడకుండా ఒకే గదిలో… సింగిల్స్ కు మాత్రమే

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×