E-Paper
Advertisement

Feel Good Movie : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ రోడ్ ట్రిప్ మూవీ… హార్ట్ టచింగ్ సీన్స్

Feel Good Movie : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ రోడ్ ట్రిప్ మూవీ… హార్ట్ టచింగ్ సీన్స్
Advertisement

Feel Good Movie : మలయాళం నుంచి మరో సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక రోడ్ ట్రిప్ గా సాగే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. కేరళ నుండి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వరకు ఐదుగురు స్నేహితులు చేసే బైక్ ప్రయాణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కొచ్చి నుంచి బయల్దేరి వాయనాడ్, మైసూరు, నాసిక్ మీదుగా ఖజురహో చేరుకునే ప్రయాణాన్ని ఇందులో అందంగా చూపించారు. స్నేహితులు, ఫ్యామిలీతో కలసి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే 

మనోజ్ వాసుదేవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మలయాళ రోడ్ మూవీ పేరు ‘Khajuraho Dreams’. ఇందులో అర్జున్ అశోకన్, షరాఫ్ యు దీన్, శ్రీనాథ్ భాసి, ధ్రువన్, అదితి రవి ప్రధాన పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఖజురహో ఆలయ ప్రాంగణంలో షూటింగ్ జరుపుకున్న అరుదైన చిత్రాలలో ఇది ఒకటి. ఈ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై, సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం Saina Play ఫిబ్రవరి 20 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఇది మలయాళ భాషలో అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ వచ్చే అవకాశం కూడా ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ ఐదుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళంతా కలిసి కొచ్చి నుండి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వరకు ఒక లాంగ్ ట్రిప్ కి బైక్ రైడ్ ప్లాన్ చేస్తారు. ఈ ప్రయాణం కేవలం సరదా కోసం మాత్రమే కాదు, వాళ్ళ జీవితాల్లో ఉన్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుండి బయటపడటానికి, మనశ్శాంతిని వెతుక్కోవడానికి కూడా. ఇక ఆ దారిలో కొత్త పరిచయాలు, అందమైన ప్రదేశాలతో కథ చూడ చక్కగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రయాణంలో వాళ్ళు ఒకరికొకరు ఎలా అండగా నిలిచారనేది దర్శకుడు చాలా నేచురల్‌గా చూపించారు. సినిమా క్లైమాక్స్‌లో ఖజురహో చేరుకున్నప్పుడు కలిగే అనుభూతి, ఆ ప్రదేశం గొప్పతనం ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇస్తుంది. స్నేహం , ట్రావెలింగ్‌లో ఉండే కిక్కును ఇష్టపడే వాళ్ళకి  ఈ కథ బాగా నచ్చుతుంది.

Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×