// // Feel Good Movie OTT : కన్నందుకు తల్లిదండ్రులపైనే కేసు -->
E-Paper
Advertisement

Feel Good Movie OTT : కన్నందుకు తల్లిదండ్రులపైనే కేసు వేసే పసి పిల్లాడు… క్లైమాక్స్ కేక

Feel Good Movie OTT : కన్నందుకు తల్లిదండ్రులపైనే కేసు వేసే పసి పిల్లాడు… క్లైమాక్స్ కేక
Advertisement

Feel Good Movie OTT : కొన్ని సినిమాలు మనసుకు హత్తుకుంటూ గుండెల్ని పిండేస్తుంటాయి. అలాంటి సినిమాలలో కొన్ని సీన్లలో మనల్ని మనం కూడా ఊహించుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఒక మూవీ వచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రద్ధ వహిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఇందులో చిన్న పిల్లాడు తల్లిదండ్రులపై కేసు కూడా వేస్తాడు. ఈ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన మూవీ ఇది. దీని పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ?అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే 

‘కాపెర్నామ్’ (Capernaum)నాడిన్ లబాకి దర్శకత్వం వహించిన లెబనీస్ చిత్రం. ఈ చిత్రంలో సిరియన్ శరణార్థి బాల నటుడు జైన్ అల్ రఫీయా బీరూట్ మురికివాడలో నివసిస్తున్న 12 ఏళ్ల జైన్ ఎల్ హజ్‌గా నటించారు. ఈ చిత్రం 2018 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. అక్కడ జ్యూరీ ప్రైజ్‌ని కూడా  గెలుచుకుంది. ఇది 2018 మే17 కేన్స్‌లో ప్రీమియర్ ప్రదర్శించిన తర్వాత 15 నిమిషాల స్టాండింగ్ ఒవేషన్‌ను అందుకుంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జైన్ అనే 12 ఏళ్ల బాలుడు బీరుట్ నగరంలోని మురికివాడల్లో తన తల్లిదండ్రులు. తోబుట్టువులతో కలిసి జీవిస్తుంటాడు. ఆ పిల్లాడు తిండి కోసం చిన్న వయసులోనే కష్టపడటం, మందులు అమ్మడం వంటి పనులు చేస్తుంటాడు. జైన్‌కు తన 11 ఏళ్ల సోదరి ‘సహర్’ అంటే చాలా ఇష్టం. అయితే పేదరికం కారణంగా ఆమె తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా, ఒక ఇంటి యజమానికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ సంఘటనతో విసిగిపోయిన జైన్ ఇంటి నుండి పారిపోతాడు. వీధుల్లో తిరుగుతున్న జైన్‌కు ‘రాహిల్’ అనే ఇథియోపియన్ శరణార్థి ఆశ్రయం ఇస్తుంది. ఆమెకు ‘యోనాస్’ అనే చిన్న బాబు ఉంటాడు.

ఒకరోజు రాహిల్ అనుకోకుండా అరెస్ట్ అవ్వడంతో, ఆ చిన్న బాబును కాపాడే బాధ్యత జైన్ పై పడుతుంది. ఆకలితో అలమటిస్తున్న బాబును సాకడానికి అతను పడే కష్టాలు గుండెల్ని పిండేస్తాయి. తన సోదరి సహర్ గర్భవతిగా ఉన్న సమయంలో సరైన వైద్యం అందక మరణించిందని తెలుసుకున్న జైన్, ఆవేశంలో ఆమె భర్తపై దాడి చేస్తాడు. దీనివల్ల జైన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జైలు నుండి జైన్ ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా తన గోడును వెళ్లబోసుకుంటాడు. పిల్లలను పెంచే శక్తి లేనివారు, కనీస అవసరాలు తీర్చలేని వారు పిల్లలను కనకూడదని కోర్టులో వాదిస్తాడు.

Advertisement

Read Also : నదిలో గుట్టలుగా ఎముకల గూళ్ళు… బోన్ చిల్లింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మావా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×