E-Paper
Advertisement

February OTT Movies : ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

February OTT Movies : ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Advertisement

February OTT Movies : జనవరి నెలలో స్టార్ హీరోల సినిమాలు బోలెడు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.. అందులో ఎక్కువగా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. ఆ సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.. వీటితో పాటు ఇంకా మరెన్నో బ్లాక్ బస్టర్లు రెడీగా ఉన్నాయి.. ఈ నెలలో ఓటీటీ ప్లాట్ఫామ్ ల లోకి రాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ ఏడాది సంక్రాంతికి తెలుగు తో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొత్తంగా 8 సినిమాల వరకు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి.. వీటిలో వా వాతియార్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. అలాగే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4న ప్రైమ్ వీడియోలో రాబోతుంది. ప్రభాస్ ది రాజాసాబ్ ఫిబ్రవరి 6న జియోహాట్ స్టార్ లో, పరాశక్తి ఫిబ్రవరి 7న జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ణప్తి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా ఒక్కొక్కటిగా ఓటీటీలోకి రానున్నాయి. ఎప్పుడు ఏ సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

ఫిబ్రవరి నెలలో ఓటీటీలోకి రాబోతున్న వెబ్ సిరీస్ ఇవే..

డెత్ విస్పరర్ 3..

Advertisement

ఒక అన్న చెల్లెల చుట్టూ తిరిగే కథ ఇది.. అతీంద్రియ శక్తుల నుంచి తన చెల్లిని ఓ అన్న ఎలా కాపాడుకోవాలి అని చేసే ప్రయత్నాలు ఈ సిరీస్ స్టోరీ. చివరికి ఆ అన్న తన చెల్లెల్ని కాపాడుకుంటాడా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే.. డెత్ విస్పరర్ సీజన్ 3. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి నెట్ ప్లిక్స్ లో రాబోతుంది.

ది లింకన్ లాయర్ సీజన్ 4..

ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో వచ్చిన వెబ్ సిరీస్.. ది లింకన్ లాయర్ సీజన్ 4 గా రాబోతుంది. డిఫెన్స్ న్యాయవాది లాయర్ మిక్కీ హాలర్ కార్లో డెడ్ బాడీ దొరుకుతుంది.. అతను నిర్దోషిగా బయటకు వస్తాడు. ఫ్రెండ్ క్రైమ్ స్టోరీ తో రాబోతున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

కొహ్రా సీజన్ 2..

Advertisement

డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ క్రైమ్ స్టోరీ తో వస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా దీని స్టోరీ ఉండబోతుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. అత్యంత క్రూరంగా హత్యలు చేసే క్రిమినల్స్ ను పట్టుకోవడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ ఫిబ్రవరి 11న రాబోతుంది.

ది కంజురింగ్: లాస్ట్ రైట్స్..

ఇది వెబ్ సిరీస్ అత్యంత భయంకరమైన సీన్లతో హారర్ జోనర్ లో తెరకెక్కుతుంది.. ఇందులో ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సారి దుష్టశక్తిని పూర్తిగా అంతం చేయడానికి ప్రయత్నాల గురించి చూపిస్తారు. ఒళ్లు గగూర్పొడిచే స్టోరీతో ఇది తెరకెక్కింది. ఫిబ్రవరి 13 నుంచి ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది..

Also Read :అల్లు అర్జున్ డైరెక్టర్ తో వరుణ్ కొత్త మూవీ.. మెగా హీరో దశ తిరగడం ఖాయం..!

వీటితో పాటుగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సముద్రపు దొంగగా నటిస్తున్న సినిమా ది బ్లఫ్ మూవీ ఈనెల 25న స్ట్రీమింగ్ కాబోతుంది.. దీంతో పాటుగాబ్రిడ్జర్టన్ సీజన్ 4: పార్ట్ 2 కూడా ఫిబ్రవరి 26 న స్ట్రీమింగ్ కు రాబోతుంది. వీటితో పాటుగా మరికొన్ని వెబ్ సిరీస్ కూడా సడన్గా ఓటీటీ లోకి ఎంటర్ ఇచ్చే అవకాశం ఉంది..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×