E-Paper
Advertisement

Fantasy movie OTT: మ్యాజిక్ బుక్ మాయాజాలం… రియల్ లైఫ్ లో స్టోరీ… కేక పెట్టించే కొరియన్ మూవీ

Fantasy movie OTT: మ్యాజిక్ బుక్ మాయాజాలం… రియల్ లైఫ్ లో స్టోరీ… కేక పెట్టించే కొరియన్ మూవీ
Advertisement

Fantasy movie OTT : ఓటీటీలలో ఇప్పుడు కొరియన్, మలయాళం సినిమాలదే ఎక్కువ హవా ఉంది. అందులో థ్రిల్లర్ సినిమాలను అస్సలు మిస్ కావడంలేదు ప్రేక్షకులు. ఇక గత ఏడాది ఒక కొరియన్ యాక్షన్ ఫాంటసీ సినిమా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ స్టోరీ ఒక నవల చుట్టూ తిరుగుతుంది. అందులో ఉన్నట్టు బయట ప్రపంచంలో కూడా జరుగుతుంటుంది. ఈ సినిమా చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడవచ్చు?

‘ఓమ్నిసెంట్ రీడర్: ద ప్రొఫెసీ’ (Omniscient Reader: The Prophecy) ప్రముఖ కొరియన్ వెబ్ నవల ‘ఓమ్నిసెంట్ రీడర్స్ వ్యూపాయింట్’ ఆధారంగా తెరకెక్కిన యాక్షన్-ఫాంటసీ సినిమా. దీనికి కిమ్ బైయుంగ్-వూ దర్శకత్వం వహించారు. ఇందులో అహ్న్ హ్యో-సియోప్, లీ మిన్-హో, ఛే సూ-బిన్, షిన్ సెయుంగ్-హో, నానా, క్వాన్ యున్-సియోంగ్, జిసూ నటించారు. ఈ చిత్రం దక్షిణ కొరియాలో 2025 జూలై 23న విడుదలైంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కిమ్ డోక్-జా అనే ఒక మామూలు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంటాడు. అతనికి ‘త్రీ వేస్ టు సర్వైవ్ ద అపోకలిప్స్’ అనే వెబ్ నవల చదవడం అంటే చాలా ఇష్టం. పదేళ్ల పాటు సాగిన ఆ నవలను చివరి వరకు చదివిన ఏకైక రీడర్ కూడా అతనే. అయితే ఆ నవల చివరి చాప్టర్ అప్‌లోడ్ అయిన వెంటనే, అందులో జరిగిన వింతలు, దాడులు నిజ జీవితంలో కూడా మొదలవుతాయి. ప్రపంచం మొత్తం ఒక భయంకరమైన గేమ్‌లా మారిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని సమయంలో, ఆ నవల మొత్తం చదివిన డోక్-జాకు మాత్రం ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. దీంతో అతను తన స్నేహితులను కాపాడుకుంటూ ప్రాణాలతో బయటపడటానికి ప్రయత్నిస్తాడు.

మరోవైపు, ఆ నవలలో అసలు హీరో అయిన యూ జూంగ్-హ్యూక్ కూడా రంగంలోకి దిగుతాడు. అతను చనిపోయినా మళ్లీ మళ్లీ పుట్టే శక్తి ఉన్న ఒక బలమైన యోధుడు. వీళ్ళు లోకాన్ని నాశనం చేయాలనుకునే శక్తులపై పోరాటం చేస్తారు. చివరికి ఈ వింత ప్రపంచంలో వీళ్ళు ఆ దుష్ట శక్తులను అంతం చేస్తారా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అసలు ఆ నవల స్టోరీ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : తండ్రీకొడుకుల ఎడబాటు… విధి ఆడే వింత నాటకం… మనసును హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×