E-Paper
Advertisement

Family drama OTT: పండగ పూట పాడెక్కే పెద్దాయన… బుర్ర హీటెక్కించే గుసగుసలు… ఇలాంటోళ్ళు కూడా ఉంటారా?

Family drama OTT: పండగ పూట పాడెక్కే పెద్దాయన… బుర్ర హీటెక్కించే గుసగుసలు… ఇలాంటోళ్ళు కూడా ఉంటారా?
Advertisement

Family drama OTT : ఓటీటీలోకి ఎన్ని సినిమాలు వచ్చినా, ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే సినిమాలతోనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఈ సినిమాలకి కామెడీ జోడిస్తే ఆడియన్స్ లో మరింత జోష్ ను నింపుతుంది. ఈ నేపథ్యంలో ఒక గుజరాతి మూవీ ఆడియన్స్ ను బాగా మెప్పించింది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఈ సినిమాతో గుజరాతీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. నవరాత్రి పండుగ సమయంలో  కుటుంబ పెద్ద అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, వెంటిలేటర్‌పైకి వెళ్ళాక ఈ కథ నడుస్తుంది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఈ గుజరాతీ కామెడీ డ్రామా మూవీ పేరు ‘వెంటిలేటర్’ (Ventilator). ఉమంగ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫల్గుణి పటేల్, లారెన్స్ డిసౌజా నిర్మించారు. ఇందులో జాకీ ష్రాఫ్, ప్రతీక్ గాంధీ, ప్రవీణ్‌చంద్ర శుక్లా, మిత్ర గాధవి, సంజయ్ గోరాడియా, ఉత్కర్ష్ మజ్ముదార్, మెహుల్ బుచ్, సుచితా త్రివేది, తేజల్ వ్యాస్, మనన్ దేశాయ్, కృనాల్ పండిత్ వంటి నటులు నటించారు. ఇది 2018 సెప్టెంబర్ 14న విడుదలైంది. 2016లో వచ్చిన జాతీయ అవార్డు పొందిన మరాఠీ సినిమా ‘వెంటిలేటర్’కు ఈ సినిమా అధికారిక రీమేక్. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నవరాత్రి పండగ హడావుడి మొదలయ్యే టైంలో, ఇంటి పెద్దాయన గిరిరాజ్ ప్రసాద్‌కు అకస్మాత్తుగా జబ్బు చేస్తే హాస్పిటల్‌లో చేరుస్తారు. ఆయన పరిస్థితి విషమించి వెంటిలేటర్ మీద పెట్టేసరికి, ఊళ్ళో ఉన్న చుట్టాలందరూ సిటీకి క్యూ కడతారు. పలకరించడానికి వచ్చిన ఆ బ్యాచ్ అంతా పెద్దాయన ఆరోగ్యం కంటే, ఆయన చనిపోతే పండగ జరుపుకోవాలా వద్దా? ఒకవేళ చనిపోతే ఎలా ? అని ఎవరికి వారే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. హాస్పిటల్ వరండాలో కూర్చున్న ఈ గ్యాంగ్ మధ్యలో పాత గొడవలు, ఆస్తి తగాదాలు బయటపడతాయి.

ముఖ్యంగా పెద్దాయన కొడుకు ప్రశాంత్ (ప్రతీక్ గాంధీ), ఈ పరిస్థితిని బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతుంటాడు. అక్కడికి వచ్చిన మిగతా చుట్టాలు కూడా సానుభూతి చూపడం మానేసి, ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారు. చివరగా గిరిరాజ్ ప్రసాద్ మేనల్లుడు జగ్గు (జాకీ ష్రాఫ్) అందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తాడు. చివరికి ఈ ఫ్యామిలీ గొడవలు సర్దుకుంటాయా ? పెద్దాయన కొలుకుంటాడా ? ఆ నవరాత్రి పండగను జరుపుకుంటారా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొనాలంటే, ఈ ఫ్యామిలీ డ్రామాను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : అడివిలో అంతుచిక్కని చావులు… వింత ఆచారాలతో ఉత్కంఠ… చూస్తే అస్సలు వదలరు

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×